దీపావళి షాపింగ్ ఇలా చేస్తే మీ డబ్బులు చాలా సేవ్ అవుతాయి..

First Published | Nov 5, 2023, 10:39 AM IST

Diwali 2023: దీపావళి పండుగకు కొన్ని రోజులే ఉంది. కాబట్టి ఇప్పటికి మార్కెట్లు దీపావళి పండుగకు సంబంధించిన వస్తువులతో కిటకిటలాడుతుంటాయి. ఈ సమయంలో షాపింగ్ చేయడం సరదాగా ఉన్నా ఒక్కోసారి తలనొప్పిగా అనిపిస్తుంది. కానీ కాస్త ఓపిక తెచ్చుకుని మంచి వస్తువులను కోరుకున్న ధరకే కొనొచ్చు. మీ డబ్బును, సమయాన్ని సేవ్ చేసే విధంగా షాపింగ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి
 

దీపావళికి ఇంటిని అందంగా అలంకరించడానికి, రుచిగల వంటలు చేయడానికి లేదా బహుమతులు ఇవ్వాడానికి దీపావళికి పక్కాగా షాపింగ్ చేస్తుంటారు. అంతేకాదు ఈ పండుగకు కొత్త బట్టలను కూడా కొంటుంటారు. అందుకే ఇతర పండుగలతో పోలిస్తే ఈ దీపావళి పండుగ  వేల మార్కెట్లలో చాలా రద్దీగా ఉంటుంది. పండుగ సీజన్ కావడంతో ఆఫ్ లైన్, ఆన్ లైన్లలో ఎన్నో ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా నడుస్తున్నాయి. తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని ఏవి పడితే అవి కొంటే మీ డబ్బులు అనవసరంగా ఖర్చుకావడంతో పాటుగా నాసీరకం వస్తువులతో మీరు మోసపోవచ్చు కూడా. అందుకే ఈ షాపింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పండుగకు మీరు ఎలా షాపింగ్ చేస్తే మీ డబ్బు సేవ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

దీపావళి షాపింగ్ చేద్దామనుకుంటే మీరు మీ బజ్జెట్ లీస్ట్ ను ఒకటి తయారుచేయండి. ఇది మీ డబ్బును సేవ్ చేయడానికి సహాయపడుతుంది. 

ఇంటి డెకరేషన్, బట్టలు, చెప్పులు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల కోసం దాదాపుగా ప్రతి నగరంలో వేర్వేరు మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు దీపావళి షాపింగ్ చేయాలనుకుంటే మీ బడ్జెట్ లో మంచి బ్రాండ్స్ దొరికే మార్కెట్ లోనే కొనండి. 
 

Latest Videos


పండుగలు దగ్గరకొస్తున్న కొద్దీ మార్కెట్లలో రద్దీ బాగా పెరగడం స్టార్ట్ అవుతుంది. అందుకే మీరు సౌకర్యవంతంగా షాపింగ్ చేయాలనుకుంటే.. పండుగకు 10 నుంచి 15 రోజుల ముందే  పెద్ద పెద్ద వస్తువులను కొనండి. 

హోమ్ డెకరేషన్ కు సంబంధించిన వస్తువులను కొనడానికి ముందు మీ ఇంటిని బాగా పరిశీలించండి. ఏవి ఉన్నాయి? ఏవి లేవు? ఎలాంటి కొనాలో ముందే డిసైడ్ చేసుకోండి. దీనివల్ల మీరు అనవసరమైన వస్తువులను కొనే అవకాశం తగ్గుతుంది. హోమ్ డెకరేషన్ కు సంబంధించిన వస్తువులు గతేడాదివి ఉంటే వాటినే ఉపయోగించండి. 
 

చెప్పులు కానీ, రెడీమేడ్ బట్టలను కానీయండి.. వాటిని పూర్తిగా చెక్ చేసిన తర్వాతే కొనండి. ఎందుకంటే ప్రతి బ్రాండ్ సైజ్ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు చెక్ చేయకుండా తీసుకుంటే ఆ తర్వాత తిప్పలు పడతారు. 

పండుగ వేళ చాలా చోట్ల అమ్మకాలు, ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి. ఆఫర్లకు టెంప్ట్ అయ్యారంటే మీ డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుంది. అందుకే మీకు కావాల్సిన వాటిని మాత్రమే కొనండి. దీని వల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది. ఏదైనా కొనడానికి ముందు ఆఫ్ లైన్, ఆన్లైన్ ధరలను పోల్చి చూడండి. మీ బడ్జెట్ లో ఎక్కడ దొరుకుతున్నాయో చెక్ చేయండి. 
 

టీవీ, ఫ్రిజ్, ఏసీ వంటి ఏదైనా పెద్ద వస్తువును కొనే ముందు వాటిని ఉపయోగించిన వారిని అంటే తెలిసిన వారిని అడగండి. అవి ఎలా పనిచేస్తున్నాయో లేదో? 

మీరు షాపింగ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మీరు కొన్న వాటిలో ఏదైన సమస్య ఉన్నా లేదా అవి పనిచేయకపోయినా వెంటనే వాటిరి తిరిగి ఇచ్చేయండి. 
 

ఆన్లైన్ చెల్లింపులు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఫోన్ లో పేమెంట్ సంబంధిత సమాచారం అడిగితే ఇవ్వకండి. ఎందుకంటే మంచి ఈ-కామర్స్ కంపెనీలు ఫోన్ లో పేమెంట్ కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పుడు కూడా అడగవు.
 

click me!