Hair Growth: జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం, ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలామందికి జుట్టు రాలే సమస్య ఎదురవుతోంది. మరి ఈ సమస్యకు ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో ఎలా చెక్ పెట్టాలో చూద్దాం.
పొడవైన, ఒత్తైన, అందమైన జుట్టు ప్రతి ఒక్కరికీ ఇష్టమే. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం, పలుచబడటం, చివర్లు చిట్లిపోవడం, జుట్టు పెరగకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలను తగ్గించుకోవడానికి కొందరు ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో జుట్టును మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా పెరుగులో మెంతులు కలిపి వాడటం వల్ల జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి ఈ హెయిర్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దామా…
26
పెరుగు, మెంతుల ప్రయోజనాలు
పెరుగు, మెంతులు రెండూ ఇంట్లో సులభంగా లభించే పదార్థాలు. పెరుగును జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారడానికి, చిక్కులు తగ్గడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు పొడిగా ఉన్నవారికి ఇది బెస్ట్. మెంతుల్లో ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషక పదార్థాలు ఉంటాయి. మెంతుల పేస్ట్‌ను పెరుగుతో కలిపి తలకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
36
హెయిర్ మాస్క్ కోసం కావాల్సిన పదార్థాలు
ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల తాజా పెరుగు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు అవసరం. ముందుగా మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు వాటిని మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో పెరుగు తీసుకొని అందులో మెంతుల పేస్ట్ వేసి బాగా కలపాలి. మిశ్రమం మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీరు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించడం మంచిది.
ముందుగా జుట్టును చిక్కులు లేకుండా మెల్లగా దువ్వుకోవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న పెరుగు, మెంతుల మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో బాగా కడగాలి. అవసరమైతే తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవచ్చు. ఇలా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం చూడవచ్చు.
56
జుట్టు ఆరోగ్యం కోసం..
జుట్టు ఆరోగ్యం కోసం హెయిర్ మాస్క్‌లతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు అందడం ముఖ్యం. రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్, జింక్, అవసరమైన విటమిన్లు అందేలా చూసుకోవాలి. పప్పులు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు, గింజలు వంటి పోషకాహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
66
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పెరుగు, మెంతులు సహజ పదార్థాలే అయినప్పటికీ ప్రతి ఒక్కరికి ఒకే విధంగా పడకపోవచ్చు. కాబట్టి ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. తలపై దురద లేదా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని ఉపయోగించకూడదు. అలాగే అప్లై చేసిన తర్వాత మంట, దురద లేదా ఎర్రదనం వస్తే వెంటనే కడిగేయాలి.