రోజూ ఈ ఆకును నమిలినా.. పచ్చ పళ్లు తెల్లగా అవుతాయి

Published : Jan 27, 2025, 04:02 PM IST

పళ్లను సరిగ్గా తోమకపోవడం వల్లే పచ్చగా అవుతాయి. ఇలాంటి వారి నోటి నుంచి వాసన కూడా వస్తుంటుంది. అయితే ఒక ఆకును నమిలితే మాత్రం ఎంతటి పచ్చగా ఉన్న దంతాలైనా తెల్లగా అవుతాయి. ఇంతకీ అది ఏ ఆకు అంటే?

PREV
16
 రోజూ ఈ ఆకును నమిలినా.. పచ్చ పళ్లు తెల్లగా అవుతాయి

కొంతమంది దంతాలు తలతలా తెల్లగా మెరిసిపోతే.. మరికొంతమంది పళ్లు మాత్రం పచ్చగా ఉంటాయి. నిజానికి పచ్చ పళ్లు, నోట్లో నుంచి వాసన రావడం మంచి విషయం కాదు. ఎందుకంటే ఇవి కూడా కొన్ని అనారోగ్య సమస్యలకు కారణం కావొచ్చు. కానీ పళ్లు పచ్చగా ఉంటే మాత్రం నలుగురిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజానికి పళ్లు పచ్చగా మారడానికి ఎన్నో కారణాలున్నాయి. స్మోకింగ్ చేయడం, దంతాలను సరిగ్గా శుభ్రపరచకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల పళ్లు ఇలా పచ్చగా అవుతాయి. 

26
yellow teeth

అయితే తులసి ఆకులు పచ్చని పళ్లను తెల్లగా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవును తులసి మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. పచ్చగా ఉన్న పళ్లను తిరిగి తెల్లగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

36
Basil Leaves Benefits

తులసి ఆకుల ప్రయోజనాలు

తులసి ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాకుండా.. పసుపు రంగులోకి మారిన చిగుళ్లు, దంతాలను తిరిగి తెల్లగా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది నోట్లో నుంచి వాసన రాకుండా చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. 

46

తులసి ఆకు

తులసి ఆకులను నమిలితే పళ్లు తెల్లగా కావడమే కాకుండా.. నోట్లో నుంచి దుర్వాసన రావడం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకుల్లో యూజెనాల్ ఉంటుంది. ఇది పంటి నొప్పిని తొందరగా తగ్గిస్తుంది. ఇందుకోసం తులసి ఆకుల్ని నమిలితే సరిపోతుంది. దీనివల్ల మీ దంతాలు శుభ్రపడటమే కాకుండా.. నోరు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. 

నోటి పరిశుభ్రత కోసం 

తులసి ఆకులు నోటి ఇన్ఫెక్షన్లకు మనల్ని దూరంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఒకవేళ నోటి ఇన్ఫెక్షన్లు అయినా ఈ ఆకులను నమిలితే తొందరగా తగ్గిపోతాయి. ఈ ఆకులను రోజూ నమలడం వల్ల మీనోరు పరిశుభ్రంగా ఉంటుంది. ఈ ఆకుల్లో ఉండే యాంటీ  ఆక్సిడెంట్లు నోటి నుంచి వచ్చే దుర్వాసనను తగ్గిస్తాయి. 

56
yellow teeth

నోటి దుర్వాసన రావొద్దంటే

తులసి ఆకులతో నోటి దుర్వాసనను తగ్గించుకోవాలనుకుంటే మీరు.. తులసి ఆకులను ఎండలో బాగా ఎండబెట్టాలి. వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని బ్రష్ తో పళ్లను తోముకోవాలి. కావాలనుకుంటే ఈ పొడితో ఆవ నూనెలో కలిపి కూడా వాడొచ్చు. ఇలా చేస్తే నోట్లో నుంచి వాసన రాదు. 

చిగురు వాపు కోసం 

తులసి ఆకులు చిగురు వాపును తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇందుకోసం మీరు తులసి ఆకుల పొడిని ఉపయోగించొచ్చు. ఇందుకోసం రోజూ తులసి ఆకుల పొడిని ఆవనూనెలో కలిపి చిళ్లకు మర్దన చేయాలి. ఇది మీకు మంచి రిలీఫ్ కలిగిస్తుంది. 
 

66
brushing teeth

దంతాలు తెల్లగా మారాలంటే.. 

తులసి ఆకులను ఉపయోగించి పచ్చ పళ్లు తెల్లగా మారడానికి ఇది ఒక నేచురల్ పద్దతి. కానీ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా తులసి పొడిని మీ టూత్ పేస్ట్ లో మిక్స్ చేసి బ్రష్ చేయాలి. ఈ పొడి దంతాలను తెల్లగా చేయడానికి సహాయపడుతుంది. 
 

click me!

Recommended Stories