పురోగతి సాధించే మార్గాలు
స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు పురోగతి అవకాశాలు ప్రారంభమవుతాయి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత భగవంతుని నామాన్ని జపించాలి. ఆ తర్వాత ఈ పూలమాలతో పాటుగా గంధాన్ని నారాయణుడికి సమర్పించాలి. ఆ తర్వాత ఈ గంధాన్ని నుదుటికి, మెడకు మీరు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల భగవంతుని అనుగ్రహంతో పాటుగా మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది.