Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇవి కచ్చితంగా చెక్ చేయండి!

Published : Apr 18, 2025, 03:16 PM IST

వేసవికాలంలో ఎక్కువగా ఉపయోగించే వస్తువుల్లో సీలింగ్ ఫ్యాన్ ఒకటి. ఏసీలు, కూలర్లు ఉన్నాసరే చాలామంది సీలింగ్ ఫ్యాన్లనే ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు భద్రతా తనిఖీలు చేయడం మంచిది. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇవి కచ్చితంగా చెక్ చేయండి!

వేసవిలో ఫ్యాన్లు పగలు, రాత్రి తేడా లేకుండా తిరుగుతూనే ఉంటాయి. వాటికిందే మనం ఎప్పుడూ కూర్చొని ఉంటాం. కానీ అవి సురక్షితంగా ఉన్నాయో లేదో చాలాసార్లు చూసుకోము. ఆ తప్పే పెద్ద ప్రమాదానికి గురిచేస్తుంది. కాబట్టి సీలింగ్ ఫ్యాన్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవెంటో చూద్దాం.

25
ప్రొఫెషనల్ ఇన్స్టాలేషన్ ముఖ్యం

చాలా మంది ఫ్యాన్‌ను స్వయంగా ఇన్‌స్టాల్ చేసుకుంటారు. కానీ ఇది ప్రమాదకరం. తప్పుడు హుక్, వదులుగా ఉన్న ఫిట్టింగ్ లేదా పిన్ లేని హోల్డర్. ఇవి ఫ్యాన్ పడిపోవడానికి కారణం కావచ్చు. ఎల్లప్పుడూ సర్టిఫైడ్ ఎలక్ట్రీషియన్ ద్వారా ఫ్యాన్ ఇన్‌స్టాల్ చేయించుకోవాలి.

35
ఫ్యాన్ హోల్డర్

సీలింగ్ ఫ్యాన్‌ను పట్టుకునే హోల్డర్ దాని ప్రాణం. వదులుగా ఉన్న నట్-బోల్ట్, సేఫ్టీ పిన్ లేకపోవడం లేదా తుప్పు పట్టిన మెటల్... ఇవన్నీ ఫ్యాన్ కింద కూర్చునే వారికి ప్రమాదం. ప్రతి వేసవిలో హోల్డర్‌ను తనిఖీ చేయాలి.

45
పాత ఫ్యాన్లు ప్రమాదకరం

చాలా ఇళ్లలో ఫ్యాన్లు 5-10 సంవత్సరాలుగా తనిఖీ లేకుండా నడుస్తుంటాయి. బ్లేడ్‌లో పగుళ్లు, మోటార్ ఓవర్‌హీట్ కావడం, షాఫ్ట్ వదులు కావడం... ఇవన్నీ ఫ్యాన్‌ను మార్చాల్సిన సమయం వచ్చిందని సూచిస్తున్నాయి.

55
ఇవి కచ్చితంగా చెక్ చేయాలి

స్క్రూలు వదులుగా ఉన్నాయా?

ఫ్యాన్ నడుస్తున్నప్పుడు వైబ్రేషన్ ఉందా?

ఏదైనా వింత శబ్దం వస్తుందా?

ఫ్యాన్ హుక్ తుప్పు పట్టిందా?

ఇవి ఏవైనా ఉంటే వెంటనే ఎలక్ట్రీషియన్‌ కు చూపించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories