పాత బెడ్ షీట్స్ ని పడేయకుండా.. ఎన్ని రకాలుగా వాడొచ్చో.. ఇప్పుడు ఓసారి చూద్దాం..
మనం దాదాపు కూరగాయలు తెచ్చుకోవడానికి ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడుతూ ఉంటాం. ఆ ప్లాస్టిక్ బ్యాగులకు బదులు.. మిగిలిపోయిన బెడ్ షీట్ తో మంచిగా క్లాత్ బ్యాగ్ కొట్టుకోవచ్చు. మీకు కుట్టడం రాకపోతే.. చిన్న కుట్టుమిషన్ దగ్గరైనా రెండు మూడు కుట్లతో కుట్టించేయవచ్చు. దానికి పెద్దగా ఖర్చు అవ్వదు. మంచిగా కూరగాయలు తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుంది. క్లాత్ బ్యాగ్ వాడటకం పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.