4.కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ ..
హాలీవుడ్‌లో ప్రముఖ దంపతులు కిమ్ కర్దాషియాన్, కేన్ వెస్ట్ లు కూడా ఈ ఏడాది ఏప్రిల్ లో విడాకులు తీసుకున్నారు. విడాకుల ప్రకటనకు ముందు నుంచే వీరు.. గత కొద్దికాలంగా వీరిద్దరి వేరువేరుగా ఉంటున్నట్టు సమాచారం. కిమ్ కర్దాషియాన్ తన నలుగురు పిల్లల్ని తీసుకొని లాస్ ఎంజెలెస్‌లోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నారు. కేన్ వెస్ట్ ప్రస్తుతం వోమింగ్‌లో ఒంటరిగా ఉంటున్నారు. వారి మధ్య విభేదాలు పరిష్కరించుకొలేని స్థాయికి వెళ్లడంతో వారిద్దరూ విడిపోయారు.కిమ్, కేన్ 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏడేళ్లు కలిసి ఉన్న వీరు ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు.