3.కొబ్బరి..
ఎండు కొబ్బరిని కూడా క్యాబిన్ బ్యాగులలోకి తీసుకువెళ్లడానికి అనుమతించరు. ఎండు కొబ్బరిలో నూనె శాతం ఎక్కువగా ఉండటం వల్ల దానికి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని దీనిని కూడా నిషేధించారు.
4. తాజా పండ్లు , కూరగాయలు
మీరు విదేశాలకు ప్రయాణిస్తుంటే, తాజా పండ్లు, కూరగాయలు ,విత్తనాలను తీసుకువెళ్లడంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, దిగుమతి చేసుకున్న పండ్లు లేదా విత్తనాలలో దేశ వ్యవసాయానికి హాని కలిగించే తెగుళ్లు లేదా వ్యాధులు ఉండవచ్చు. దొరికితే భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
5. మాంసం, పాల ఉత్పత్తులు
చాలా దేశాలు, ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా , ఐరోపా దేశాలు, విమానాలలో దిగుమతి చేసుకున్న మాంసం, చీజ్ లేదా పాల ఉత్పత్తులను అనుమతించవు. మీరు వీటిని తీసుకువెళ్లాలంటే.. ఎయిర్ లైన్స్ తో ముందుగానే మాట్లాడుకోవడం ఉత్తమం.