Mother's Day 2022: అమ్మకు మీరు ఇవ్వగలిగే విలువైన బహుమతి ఏంటో తెలుసా?

Published : May 06, 2022, 02:00 PM ISTUpdated : May 07, 2022, 12:08 PM IST

Mother's Day 2022: నడకను నేర్పేది అమ్మ.. తొలి పలుకులో మనం పలికేది అమ్మ.. మనకు దెబ్బ తగిలితే మన తల్లి విలవిలలాడుతుంది..  

PREV
17
Mother's Day 2022: అమ్మకు మీరు ఇవ్వగలిగే విలువైన బహుమతి ఏంటో తెలుసా?

తన కడుపు మాడ్చుకొని పిల్లల కడుపు నింపే త్యాగమూర్తి (Sacrifice) అమ్మ.. పిల్లల భవిష్యత్తు కోసం అలుపెరగకుండా నిరంతరం శ్రమించేది అమ్మ.. ఇలా అమ్మ ప్రేమ గురించి ఎన్ని విధాలుగా చెప్పినా తక్కువే.. అసలు మాతృ దినోత్సవం (Mother's Day) ఎందుకు జరుపుకుంటారు, ఎప్పుడు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

27

స్వార్థం లేకుండా నిస్వార్థంగా పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతున్న మాతృమూర్తుల కోసం ప్రతి సంవత్సరం మదర్స్ డే నిర్వహిస్తున్నారు. మే నెలలో వచ్చే రెండవ ఆదివారం (Second Sunday) రోజున మదర్స్ డే ని జరుపుకుంటారు. 1914 నుంచి అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ (Woodrow Wilson) మదర్స్ డే వేడుకకు అంకురార్పణ చేశారు.
 

37

తరువాత అన్ని దేశాలలోనూ మనకోసం అన్ని చేస్తున్న అమ్మలకు ఒక్కరోజును కేటాయించడం గొప్ప కదా.. అని ఆలోచించి ఈ వేడుకను అందరూ చేసుకుంటున్నారు. ప్రతి స్త్రీకి మాతృత్వం (Motherhood) అనేది ఒక వరం లాంటిది. స్త్రీ కడుపులో బిడ్డ బీజం పడినప్పుడు ఆమె సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ పురిటి నొప్పులను (Hemorrhoids) సంతోషంగా భరిస్తుంది.
 

47

అందుకే ప్రపంచంలో అన్ని బంధాలకంటే పేగుబంధమే విలువైనది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరి పాత్ర ఉన్నప్పటికీ ఎక్కువ అనుబంధం (Appendix) ఉండేది అమ్మతోనే. అమ్మ పాడే జోల పాట, గోరుముద్దలు తిన్న జ్ఞాపకాలు ఎవరి జీవితంలోనైనా మధుర స్మృతులే (Sweet memories). తన పిల్లలను ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోదు. పిల్లల మనస్తత్వాన్ని సరిగ్గా అంచనా వేసి వారి కోరికలను తీర్చే కల్పవల్లి అమ్మ.. 
 

57

ఎంత వయసు వచ్చినా, ఎంత గొప్ప స్థాయికి (Great level) చేరిన అమ్మ ప్రేమ ముందు దాసోహం కావాల్సిందే.. ఇలా మన కోసం నిరంతరం శ్రమించే అమ్మ కోసం మదర్స్ డే ఒక్క రోజునే మీ ప్రేమను చూపించి, అమ్మతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రేమను వ్యక్తపరచడం (Expressing love) కాదు. ప్రతి తల్లికి ప్రతిరోజూ మదర్స్ డే అవ్వాలి.
 

67

ప్రతిరోజూ ఆమెతో కొద్ది సమయాన్ని కేటాయిస్తూ ఆమె బాగోగుల గురించి అడిగి తెలుసుకుంటే అంతకు మించిన ఆనందం (Happiness) తల్లికి ఉండదు. ప్రతి ఒక్కరు అమ్మకు ఇవ్వగలిగే గిఫ్ట్ రోజుకు ఒక గంట. అమ్మ ప్రేమ తరగనిది.. వెలకట్టలేనిది.. కనుక అమ్మను వృద్ధాప్యంలో భారంగా భావించకుండా ప్రేమగా చూసుకుంటూ ఆమె ప్రేమని మనం తిరిగి ఆమెకు అందించినప్పుడు ఆమె సంతోషానికి అవధులు ఉండవు. కనపడని దేవుని కన్నా కనిపించే అమ్మే మొదటి దేవత (Goddess).
 

77

అందుకే అమ్మకు మించిన దైవం లేదంటారు.  అడగందే అమ్మయినా అన్నం పెట్టదు అంటారు.. ఇది నిజానికి అబద్ధం. తల్లి బిడ్డ ఆకలిని (Hunger) తీర్చడంలో మొదట ఉంటుంది. బిడ్డ పెదవులపై చిరునవ్వు కోసం తాను ఎంత కష్టాన్నయినా నవ్వుతూ భరిస్తుంది. పిల్లల ఎదుగుదల కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న తల్లులందరికీ ఈ ఆర్టికల్ తరుపున మదర్స్ డే శుభాకాంక్షలు (Happy Mother's Day)..

click me!

Recommended Stories