ఈ ఫేస్ ప్యాక్ లతో మీ అందం డబుల్ అవుతుంది.. అంతేకాదండోయ్ ముడతలు, మచ్చలు మటుమాయం అవుతాయి..

First Published Oct 10, 2022, 4:55 PM IST

వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై మచ్చలు, ముడతలు రావడం సర్వ సాధారణం. కానీ ఇవి అందాన్ని పూర్తిగా తగ్గిస్తాయి. కానీ కొన్ని ఫేస్ ప్యాక్ లు వీటిని ఆపుతాయి. అవేంటంటే.. 
 

skin care

మన శరీరంలోని అవయవాలలో చర్మం ఒకటి.  దీనిద్వారే మన వయసు పెరుగుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. అదేనండి ముడతలు, మచ్చలు. ఈ రెండు చాలు మన వయసు కరిగిపోతుందన్న ముచ్చట తెలియడానికి. వయసులో ముడతులు, మచ్చలు సర్వసాధారణమే..  అయినప్పటికీ.. ఇవి అందాన్ని మాత్రం తగ్గిస్తాయి. అందుకే చాలా మంది ఎన్నో ప్రొడక్ట్స్ ను యూజ్ చేస్తుంటారు. ఏదేమైనా వృద్ధాప్యాన్ని ఎంతటి వారైనా ఆపలేరు. కాకపోతే చర్మ సంరక్షణతో వీటిని కొన్ని రోజుల వరకు వాయిదా వేయొచ్చు. అయితే కొన్ని ఫేస్ ప్యాక్ లు మొఖంపై మచ్చలను, ముడతలను తగ్గిస్తాయి. అంతేకాదు మీ అందాన్నిరెట్టింపు చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

కలబంద

మన చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా చేయడంలో కలబంద ఎప్పుడూ ఫస్ట్ ఫ్లేస్ లోనే ఉంటుంది. ముఖంపై ముడతలను, మచ్చలను తొలగించడంలో అలొవెరా జెల్ ఎఫెక్టీవ్ పనిచేస్తుంది. ఇందుకోసం ఒక టీస్పూన్ కలబంద జెల్ లో రెండు టీస్పూన్ల దోసకాయ రసం వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోండి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. 

పెరుగు

పెరుగు మన ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం రెండు చెంచాల కలబంద జెల్ లో ఒక చెంచా పెరుగు ను వేసి బాగా కలపండి. డ్రై స్కిన్ ఉంటే ఈ మిశ్రమానికి ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే మీ ముఖం తేమగా.. అందంగా మెరిసిపోతుంది. 
 

శెనగ పిండి

రెండు టీస్పూన్ల శెనగపిండిలో ఒక టీస్పూన్ ఓట్ మీల్, పెరుగు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని నీట్ గా కడిగేయండి. దీన్ని వారానికి రెండు లేదా మూడు రోజులు పెడితే మచ్చలు, ముడతలు తగ్గిపోతాయి. 
 

బొప్పాయి

బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ, పపైన్ ఎంజైమ్ ముఖం పై మృతకణాలను తొలగిస్తాయి. అలాగే బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను నివారిస్తాయి. బొప్పాయి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలంటే ముందుగా పండిన నాలుగు బొప్పాయి ముక్కలను తీసుకుని పేస్ట్ లా తయారుచేయండి. దీనిలో ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత కడిగేయండి.

కాఫీ పౌడర్

కాఫీ కూడా ముఖంపై ముడతలను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం గ్లో ను మెయింటైన్ చేయడంలో సహాయపడతాయి. ఇందుకోసం కాఫీ పౌడర్ కు కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ తో కలిపి ముఖానికి అప్లై చేయండి. దీన్ని 15 నిమిషాల తర్వాత కడిగేయండి.  
 

click me!