బరువు పెరిగితే హార్ట్ ప్రాబ్లమ్స్, ఊబకాయం, టైప్ 2 డయాబెటీస్, అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన సమస్యల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ బరువు తగ్గేందుకు స్పెషల్ డైట్, ఎక్సర్ సైజెస్ చేస్తుంటారు. అయితే అధిక బరువు నుంచి బయటపడేందుకు ప్రతి వంటింట్లో లభించే మసాలా దినుసు అయినా దాల్చిన చెక్క ఔషదంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.