కర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 4, 2024, 4:57 PM IST

ఉదయం ఎప్పుడో ఆఫీసుకు వెళ్లేటప్పుడు స్నానం చేసినా.. రాత్రి మళ్లీ ఇంటికి వచ్చే వరకు ఫ్రెష్ గా ఉంటే ఎంత బాగుంటుందో కదా.. దాని కోసం చాలా మంది పర్ఫ్యూమ్స్ వాడతారు. కానీ... ఆ కెమికల్స్ తో సంబంధం లేకుండా.. కేవలం ఒక్క చిన్న వస్తువు చేర్చితే... రోజంతా తాజాగా ఉండొచ్చు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

కర్పూరం

కర్పూరం గురించి అందరికీ తెలుసు. కర్పూరం అనగానే మనకు ముందు దేవుడు గుర్తుకు వస్తాడు. ఆ తర్వాత దాని నుంచి వచ్చే కమ్మని  వాసన కూడా గుర్తుకు వస్తుంది.  కర్పూరం వెలిగించకుండా, హారతి ఇవ్వకుండా పూజ పూర్తి కాదు. అయితే.. పూజకి మాత్రమే కాదు.. ఆయుర్వేదం ప్రకారం.. చాలా రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలోనూ కర్పూరం కీలక పాత్ర పోషిస్తుంది.

చాలా రకాల వ్యాధులను తగ్గించడంలో కర్పూరంను ఉపయోగిస్తారని మీరు వినే ఉంటారు. కానీ... మనల్ని రోజంతా తాజాగా ఉంచడానికీ, మన అందాన్ని పెంచడానికి కూడా ఈ కర్పూరం పని చేస్తుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్నానం

మనం రోజూ స్నానం చేస్తాం. అయితే.. స్నానం చేసిన ఒక గంటకే.. ఆ ఫ్రెష్ నెస్ తగ్గిపోతుంది. చెమట వాసన కూడా రావడం మొదలౌతుంది. ఆ వాసనను కంట్రోల్ చేయడానికి పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ వాడతాం. అవి కూడా మరో గంటను ఫ్రెష్ గా ఉంచగలవు. అంతే.. కానీ.. మనం స్నానం చేసే సమయంలో చిన్న కర్పూరం ముక్కను ఆ స్నానం నీటిలో వేసి కలిపి చేయడం వల్ల... రోజంతా ఫ్రెష్ గా ఉండటంతో పాటు.. మన అందాన్ని కూడా పెంచుకోవచ్చని మీకు తెలుసా?

కర్పూరంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ బయోటిక్ గుణాలు ఉన్నాయి. నీటిలో వేసి స్నానం చేస్తే దురద, దద్దుర్లు, మొటిమలు వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. సహజ సౌందర్య సాధనంగా పనిచేస్తుంది.

Latest Videos


కర్పూరం

స్నానం చేసేటప్పుడు కర్పూరం వాసన మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. ఈ రోజుల్లో చేసే పనిలో ఒత్తిడితో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. వారు స్నానం చేసేటప్పుడు ఈ కర్పూరాన్ని వినియోగిచడం వల్ల.. ఆ ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ రిలీఫ్ గా అనిపిస్తుంది. అంతేకాదు.. చాలా రకాల శారీరక సమస్యలను కూడా తగ్గిస్తుంది. తలనొప్పి, వెన్నునొప్పి కూడా తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, పుండ్లతో బాధపడేవారు తరచూ స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.

కర్పూరం స్నానం

కర్పూరాన్ని గోరువెచ్చని నీటిలో వేసి స్నానం చేస్తే అలసట, నీరసం తగ్గుతాయి. యాక్టివ్‌గా మారతారు. అది కొత్త శక్తిలా పనిచేస్తుంది. ఈ నీటి నుంచి వచ్చే మంచి సువాసన వల్ల.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రిపూట ఇలా చేస్తే మంచి నిద్ర పడుతుంది. (గమనిక: ఇంటర్నెట్‌లో లభించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందిస్తున్నాం. కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. AsianetNewsTelugu.com ఎలాంటి పురోగతికి బాధ్యత వహించదు.)

click me!