శృంగారానికి ముందు అమ్మాయిల్లో ఉండే సందేహాలివే..

First Published | May 17, 2019, 3:18 PM IST

ప్రతి అమ్మాయికి శృంగారానికి ముందు కొన్ని సందేహాలు ఉంటాయి. అయితే... వాటిని చాలా కొద్ది మంది మాత్రమే నివృత్తి చేసుకుంటారు. మిగితావారంతా మనసులోనే దాచేసుకుంటారు.

అనుమానం ముందు పుట్టి... అమ్మాయి పుట్టిందా.. లేక అమ్మాయి పుట్టాక అనుమానం పుట్టిందా లాంటి సామేతను పురుషులు చాలా విరివిగా వాడేస్తుంటారు. గర్ల్ ఫ్రెండ్ వరసగా రెండు లేదా మూడు ప్రశ్నలు వేసిందంటే చాలు.. ఇంత అనుమానం ఏంటే నీకు అంటారు. అది వాళ్లకు అనుమానంలా అనిపించినా... నిజానికి స్త్రీలో ఉండే సందేహాలు అవి.
వాటినే ప్రశ్నల రూపంలో అడిగేస్తుంటారు. ప్రతి అమ్మాయికి శృంగారానికి ముందు కొన్ని సందేహాలు ఉంటాయి. అయితే... వాటిని చాలా కొద్ది మంది మాత్రమే నివృత్తి చేసుకుంటారు. మిగితావారంతా మనసులోనే దాచేసుకుంటారు. మరి ఆ సందేహాలేంటో మనమూ ఓ సారి తెలుసుకుందామా.

హెచ్ఐవీ పరీక్షలు చేయించుకొన్నారా? ఎప్పుడు చేయించుకొన్నారు? ఈ ప్రశ్న అడగాలని చాలామందికి అమ్మాయిలకు ఉన్నప్పటికీ అడగడానికి ధైర్యం చేయరు. కానీ సెక్స్‌లో పాల్గొనడానికి ముందే అమ్మాయిలంతా.. ఈ ప్రశ్నను తమ భాగస్వామిని కచ్చితంగా అడగాల్సిందే.
దానికి సమాధానం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
అతనికి లైంగికపరమైన వ్యాధులు, సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్న అడగడం చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నే. ఎందుకంటే ఈ సుఖవ్యాధులకు సరైన రక్షణ తీసుకోకుండా సంభోగంలో పాల్గొంటే ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి.
ఈ విషయం అతను మీ దగ్గర దాచిపెట్టి.. మీతో కలయికలో పాల్గొంటే అవి మీకు కూడా సోకే అవకాశం ఉంటుంది. గనేరియా, హెర్పిస్ వంటి వ్యాధులు సోకితే అవి దీర్ఘకాలం పాటు వేధిస్తాయి. అందుకే ముందుగానే అతనికి.. ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అడగాల్సిందే.
కండోమ్స్ వాడటంలో నీకేమీ అభ్యంతరం లేదు కదా? వాటిని ఉపయోగించడం నీకు ఇష్టమే కదా? ఎందుకంటే కండోమ్స్ వాడే విషయంలో చాలామంది అబ్బాయిలకు ఫోబియా ఉంటుంది. వాటిని వాడటం వల్ల వారికి కావాల్సిన సంతృప్తి దొరకదేమోననే అపోహే దీనికి కారణం. అందుకే ఈ విషయంలో కూడా ముందే క్లారిటీ తీసుకోవాల్సిందే.
ఎందుకంటే రిస్క్ తీసుకోవడం మంచిది కాదు కదా. కండోమ్ ఉపయోగించడం వల్ల అవాంఛిత గర్భం రాకుండా ఉండటంతో పాటు.. లైంగికపరమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
నా నుంచి నువ్వేమి కోరుకొంటున్నావు? ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత బలమైనదో చెబుతుంది. ఇద్దరూ సీరియస్ రిలేషన్ షిప్‌లో ఉన్నారా? లేదా? అనే క్లారిటీ సైతం ఈ ప్రశ్నకు అతను ఇచ్చే సమాధానంతో మీకు తెలిసిపోతుంది. ముఖ్యంగా మీతో అతను బంధంలో కొనసాగాలని భావిస్తున్నాడా? లేదా? అనే విషయానికి అతను ఇచ్చే సమాధానం.. ఈ ప్రశ్న తర్వాత అతని ప్రవర్తనే మీకు తెలియజేస్తాయి.
ప్రస్తుతం నాతో కాకుండా.. మరెవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? ఇలా అడగడంలో ఏ మాత్రం తప్పు లేదు. పైగా ఇటీవలి కాలంలో ఒకే సమయంలో ఒకరి కంటే ఎక్కువ మందితో బంధాన్ని కొనసాగించే మోసగాళ్ల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సిందే. దానికి సమాధానం తెలుసుకోవాల్సిందే.
అయితే ఈ ప్రశ్నకు అతడి దగ్గరి నుంచి కచ్చితమైన సమాధానం వస్తుందని భావించవద్దు. ఎందుకంటే.. ఈ విషయంలో నిజాయతీగా వ్యవహరించేవారు చాలా తక్కువ. అందుకే ఈ ప్రశ్న అడిగిన తర్వాత అతడి బాడీ లాంగ్వేజ్‌లో వచ్చిన మార్పును గమనించండి. అది మీకు మామూలుగా అనిపిస్తే సరి. లేదా కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా, నెర్వస్‌గా కనిపిస్తే ఆలోచించాల్సిన విషయమే.

Latest Videos

click me!