ముక్కుపై నల్ల మచ్చలను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవి..

First Published | Feb 6, 2024, 2:14 PM IST

Beauty Tips:ఆడవాళ్లే అందంగా కనిపించే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వీళ్లకే ముక్కుపై మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. మీరెంత అందంగా ఉన్నా.. ముక్కుపై మచ్చలుంటే మాత్రం మీ అందం మొత్తం తగ్గుతుంది. ఇక ఈ మచ్చలను తగ్గించుకునేందుకు ఎన్నో రకాల క్రీం లను వాడుతుంటారు. కానీ ఇంట్లో ఉండే వాటితో ఈ మచ్చలను చాలా ఈజీగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పెళ్లైన చాలా మంది ఆడవారికి ముక్కుపై నల్ల మచ్చలు ఖచ్చితంగా ఉంటాయి. ఒక వయసు తర్వాత ఈ మచ్చలు రావడం ప్రారంభిస్తాయి. కానీ ముక్కుపై ఉండే నల్ల మచ్చలు అందాన్ని తగ్గిస్తాయి. కానీ ముక్కుపై ఉండే నల్ల మచ్చలను పోగొట్టడం అంత సులువైన పనేం కాదు. ఈ మచ్చలు పోవాలని ఎన్నో చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో కూడా ముక్కుపై నల్ల మచ్చలను పోగొట్టొచ్చు. ఎలాగో చూద్దాం పదండి. 

blackheads

అరటి తొక్క

అరటి తొక్క కూడా ముక్కుపై ఉండే నల్ల మచ్చలను చాలా ఈజీగా పోగొడుతుంది. అవును డార్క్ స్పాట్స్ ను తగ్గించే సింపుల్ హోం రెమెడీ ఇది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. అరటిపండు తిన్నప్పుడల్లా దాని తొక్కను పారేయకుండా ముక్కుపై ఉండే నల్లటి మచ్చలపై రుద్దండి. ఇలా చేస్తే నల్లటి మచ్చలు తగ్గుతాయి.


Image: Freepik

పసుపు

పసుపు మన చర్మానికి చేసే మేలు ఎంతో. పసుపులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముక్కుపై ఉండే నల్లటి మచ్చలు పోవాలంటే పసుపులో కొద్దిగా కొబ్బరినూనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేయండి. ఇలా వారానికి 2-3 సార్లు పసుపును ఉపయోగిస్తే సరిపోతుంది. 

తేనె

తేనెలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. తేనె కూడా నల్ల మచ్చలను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం తేనెను నల్లమచ్చలపై అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి. తేనె అదనపు నల్ల వర్ణద్రవ్యం ఉత్పత్తిని నివారిస్తుంది.

ముల్తానీ మట్టి


ముల్తానీ మట్టి ముక్కుపై ఉండే నల్లటి మచ్చలను పోగొట్టడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ముల్తానీ మట్టిని పేస్ట్ గా చేసి నల్లని మచ్చలపై అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత నీళ్లతో తడిపి కాసేపు మసాజ్ చేసి కడిగేయండి. ఇలా రోజూ చేస్తే కొన్ని రోజుల్లోనే ముక్కుపై నల్ల మచ్చలు తగ్గిపోతాయి. 
 

గుడ్లు

డార్క్ స్పాట్స్ ను తొలగించడంలో గుడ్లు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం గుడ్డులోని తెల్లసొన తీసుకుని అందులో 1 టీస్పూన్ తేనెను వేసి బాగా కలపండి. దీన్ని నల్లమచ్చలపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి కనీసం రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

బియ్యప్పిండి

బియ్యం పిండి ముక్కుపై ఉండే నల్ల మచ్చలను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం బియ్యం పిండిని తీసుకుని అందులో అలోవెరా జెల్ ను మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేయండి. తర్వాత ఈ పేస్ట్ ను ముక్కు మీద అప్లై చేయండి. ఇది బాగా ఆరిన తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని కడుక్కోండి. తేడా మీకే కనిపిస్తుంది. 

Latest Videos

click me!