Navaratri 2021 : దోపిడీ దొంగలు కట్టించిన ఆలయం.. నైవేద్యంగా మద్యం.. ఎక్కడంటే...

First Published Oct 7, 2021, 10:47 AM IST

Rajasthanలోని నాగౌర్ జిల్లాలోని భన్వల్ గ్రామంలోని Banwala మాత మందిరం. ఈరోజు నుంచి ఇక్కడ కూడా Navaratri 2021 ప్రారంభమయ్యాయి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మిగతా ఆలయాలలో మాదిరిగా ఈ ఆలయంలో అమ్మవారికి పులిహోర, పరమాన్నం ప్రసాదాలుగా పెట్టరు. వీటికి బదులుగా మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు.

దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి.  విజయదశమి వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.  దేశంలో అమ్మవారి ఆలయాలు అనేకం ఉన్నాయి. అయితే వీటిలో పురాతన చరిత్ర కలిగిన ఆలయాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ ఆలయాల  నిర్మాణం వెనుక ఆసక్తికర గాథలు ఉంటాయి.

వాటిలో ఒకటి Rajasthanలోని నాగౌర్ జిల్లాలోని భన్వల్ గ్రామంలోని Banwala మాత మందిరం. ఈరోజు నుంచి ఇక్కడ కూడా Navaratri 2021 ప్రారంభమయ్యాయి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మిగతా ఆలయాలలో మాదిరిగా ఈ ఆలయంలో అమ్మవారికి పులిహోర, పరమాన్నం ప్రసాదాలుగా పెట్టరు. వీటికి బదులుగా మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు.

వినేందుకు ఇది వింతగా అనిపించినప్పటికీ ఇది ఆలయంలో ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఇక్కడికి వచ్చే భక్తుల దగ్గర బీడీలు, సిగరెట్లు,  తంబాకు, జర్దా, తోలు పర్సు మొదలైనవి ఉంటే వారు అమ్మవారికి ప్రసాదం సమర్పించేందుకు అనర్హులు. పైగా, ఇక్కడ అమ్మవారికి సమర్పించే liquorని భక్తులు మత్తుపదార్థం గా భావించరు.

Temple priest తన కళ్ళు మూసుకుని అమ్మవారి ముందు ఉంచుతారు. ఈ విధంగా మూడు సార్లు Offeringగా అమ్మవారికి మద్యం సమర్పిస్తారు.  ఇలా మూడవసారి సమర్పించిన మద్యం పాత్రను అమ్మవారి ముందు ఉంచాక కొద్దిసేపటి  తరువాత దానిలో సగం మద్యమే మిగులుతుంది.  దీనిని అమ్మవారి అనుగ్రహం గా భక్తులు భావిస్తారు.

Banwala Mata

ఈ ఆలయానికి ఎనిమిది వందల యేళ్ళ పురాతన చరిత్ర ఉంది. ఈ ఆలయాన్నిరాజులో లేక ధర్మ గురువులో నిర్మించ లేదు.  దారికాచి దోపిడీలకు పాల్పడే దొంగలు నిర్మించారు.  ఆలయంలో  రెండు అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. ఒక అమ్మవారి విగ్రహాన్ని బ్రాహ్మణి మాత అని పిలుస్తారు. ఈ అమ్మవారికి మిఠాయిలను ప్రసాదంగా పెడతారు.

మరో అమ్మవారి విగ్రహాన్ని  కాళీమాతగా కొలుస్తారు.  ఈ అమ్మవారికి మద్యాన్ని  ప్రసాదంగా సమర్పిస్తారు.  ఈ ఆలయంలో భక్తులు కోరుకున్న కోరికలు  నెరవేరుతాయని అవి తీరాక మరోమారు అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులు చెబుతుంటారు. స్థానికంగా ఉన్న వృద్ధులు తెలిపిన వివరాల ప్రకారం... పూర్వ కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు తన సైన్యం సాయంతో ఒక దొంగల ముఠాను చుట్టుముట్టారు.

Banwala Mata

మరో అమ్మవారి విగ్రహాన్ని  కాళీమాతగా కొలుస్తారు.  ఈ అమ్మవారికి మద్యాన్ని  ప్రసాదంగా సమర్పిస్తారు.  ఈ ఆలయంలో భక్తులు కోరుకున్న కోరికలు  నెరవేరుతాయని అవి తీరాక మరోమారు అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులు చెబుతుంటారు. స్థానికంగా ఉన్న వృద్ధులు తెలిపిన వివరాల ప్రకారం... పూర్వ కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు తన సైన్యం సాయంతో ఒక దొంగల ముఠాను చుట్టుముట్టారు.

 దీంతో ఆ thieves Gang నాయకుడు తమను కాపాడమని అమ్మవారిని వేడుకున్నాడంట. దీంతో అమ్మవారు ఆ దోపిడీ దొంగలను మేకలు, బర్రెలుగా మార్చి వేసిందట.  ఈ విధంగా ప్రాణాలు దక్కించుకున్న దోపిడీ ముఠా నాయకుడు అమ్మవారికి ఈ ఆలయ నిర్మించాడట.  రాతి యుగంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

click me!