అరటిపండు కాదు అరటి తొక్కను తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Sep 12, 2024, 5:15 PM IST

సాధారణంగా అరటిపండును తినేసి దాని తొక్కను డస్ట్ బిన్ లో పడేస్తుంటారు. కానీ అరటి తొక్కలు కూడా మన ఆరోగ్యానికి, అందానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 
 

అరటి పండు వల్ల మన ఆరోగ్యానికి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చాలా మంది రోజూ ఒక అరటిపండును తింటుంటారు. నిజానికి అరటి పండు బరువును పెంచడం నుంచి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ దీని తొక్క గురించి మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. 

అవును పనికి రాదనుకునే అరటి తొక్క మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మన శరీరానికి పోషణను ఇవ్వడం నుంచి మన జుట్టుకు, చర్మానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అసలు మనకు అరటి తొక్కలు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

అరటి తొక్క ఆరోగ్య ప్రయోజనాలు

అరటి తొక్కలు మన శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా దీనిలో విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటుంది. ఇది నిరాశ, ఒత్తిడి, వంటి ఎన్నో మానసకి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది మనం రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. అరటి తొక్క మన మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని కూడా చూపుతుంది.
 
అరటి తొక్కల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంటే ఇవి జీర్ణవ్యవస్థను నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. అలాగే ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. 

Latest Videos


అరటి తొక్కల్లో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.

అలాగే అరటి తొక్కల్లో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. 

ఎక్కువ ముడి కూరగాయల తొక్కలు అంటే పండని తొక్కలను తింటే శరీరంలో యాంటీఆక్సిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అరటి తొక్కక్యాన్సర్ నిరోధక లక్షణాలపై  ఎన్నో అధ్యయనాలు కూడా జరిగాయి. 
 

అయితే అరటి తొక్కలు మనుషుల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయో లేదో  తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరమవుతాయి. అరటి తొక్కను మీరు ఎన్నో విధాలుగా తినొచ్చు.  దీన్ని నీళ్లు, చక్కెరతో పేస్ట్ చేసి తొనొచ్చు లేదా. కారం లేదా ఉడకబెట్టి వివిధ రకాలుగా తినొచ్చు. 

అరటి తొక్క వల్ల కలిగే బ్యూటీ బెనిఫిట్స్

అరటి తొక్కలతో కూడా మీరు మీ అందాన్ని పెంచుకోవచ్చు. ఈ తొక్కల్లో సిలికా, యాంటీఆక్సిడెంట్లతో పాటుగా ఎన్నో రకాల పోషకాలుంటాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీన్ని మీరు హెయిర్ మాస్క్ గా వేసుకుంటే మీ జుట్టు రాలడం తగ్గుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. 

అరటి తొక్క హెయిర్ మాస్క్ వేసుకుంటే మీ జుట్టు హైడ్రేట్ గా ఉంటుంది. బలంగా ఉంటుంది. అలాగే మీ జుట్టు మరింత ఆరోగ్యవంతంగా ఉంటుంది. అరటి తొక్కలో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

విటమిన్ సి కూడా మెండుగా ఉంటుంది. ఇవన్నీ మన చర్మాన్ని సూర్యరశ్మి నుంచి రక్షిస్తాయి. అలాగే సూర్య రశ్మి వల్ల వచ్చిన చర్మ సమస్యలను, మొటిమలను, మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి. 

click me!