Lice: తలలో పేలు బాగా పట్టేశాయా? అయితే ఈ ఇంటి చిట్కాలతో ఇట్టే వదిలించేసుకోండి

Published : Nov 19, 2026, 05:08 PM IST

Lice: తలలో పేలు పట్టడం ఎంతో మందికి ఎదురయ్యే సమస్య. కానీ వాటిని వదిలించుకోవడం మాత్రం చాలా కష్టం. రసాయనాలు కలిసిన మందులు వాడడం ఇష్టం లేని వారు కొన్ని ఇంటి చిట్కాలతో తలలో పేలు సమస్య నుంచి బయటపడవచ్చు.

PREV
13
తలలో పేల సమస్య

పాఠశాలకు వెళ్లే పిల్లల్లో తలలో పేల సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్క పేను తలలోకి చేరితే చాలు, అది రోజుకు పది గుడ్ల వరకు పెట్టి వేగంగా తన సంఖ్యను పెంచుకుంటుంది. ఈ పేలు తలపై రక్తాన్ని పీల్చడం వల్ల విపరీతమైన దురద పుడుతుంది. దీనివల్ల పిల్లలకు చదువుపై ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడతారు. అంతేకాకుండా రక్తం తగ్గిపోయి రక్తహీనత రావడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. వారం రోజుల పాటు పట్టించుకోకపోయినా తల నిండా పేలు చేరిపోయే ప్రమాదం ఉంది. అందుకే పేల సమస్యను ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

23
పేలను వదిలించే ఇంటి చిట్కాలు

ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో ఈ పేల బెడదను సులువుగా వదిలించుకోవచ్చు. ముందుగా పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే పేలు నీటితో పాటు బయటకు వెళ్లిపోతాయి. అలాగే వేపాకు, తులసి ఆకులను మెత్తగా రుబ్బి, అందులో కొంచెం పసుపు, కొబ్బరి నూనె కలిపి జుట్టుకు రాయాలి. ఆ మిశ్రమం పూర్తిగా ఆరిన తర్వాత స్నానం చేస్తే ఆ ఘాటు వాసనకు పేలు నశిస్తాయి. కొబ్బరి నూనెలో కాస్త సోంపు నూనె కలిపి రాసినా, నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి తలకు పట్టించినా మంచి ఫలితం ఉంటుంది. ఈ వాసనలను పేలు అసలు తట్టుకోలేవు.

33
ఈ జాగ్రత్తలు తీసుకోండి

జుట్టు అపరిశుభ్రంగా ఉన్నప్పుడే పేలు ఎక్కువగా పడతాయి. కాబట్టి వారానికి కనీసం రెండుసార్లు కచ్చితంగా తలస్నానం చేస్తూ మాడును శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ పేల దువ్వెనతో జుట్టును బాగా దువ్వుకోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల తలలో ఉన్న పేలు, ఈపులు కిందకు రాలిపోతాయి. ముఖ్యంగా తలలో పేలు ఉన్నవారికి దూరంగా ఉండటం చాలా అవసరం. తల తరచూ దురద పెడుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇంటి చిట్కాలను పాటిస్తే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories