చాలామంది తమది పొడి జుట్టు అని చెప్పి, ఇష్టమొచ్చినట్టు నూనె రాసేస్తుంటారు. నిజానికి దీని అవసరం లేదు. జుట్టును కొద్దిగా తడిపిన తర్వాత నూనె రాస్తే, అది కుదుళ్లకు సులభంగా పడుతుంది. ఎక్కువ నూనె వాడాల్సిన అవసరం కూడా ఉండదు.
షాంపూ చేయడానికి సుమారు 5 నుంచి 10 నిమిషాల ముందు, జుట్టుకు, కుదుళ్లకు కొద్దిగా నూనె రాయండి. నూనె రాసేటప్పుడు తల చర్మాన్ని గట్టిగా రుద్దకండి. గోళ్లతో గీరడం కూడా మానుకోండి. వేలికొనలతో నెమ్మదిగా మసాజ్ చేయండి. నూనె రాసిన కాసేపటి తర్వాత షాంపూతో జుట్టును శుభ్రంగా కడుక్కోండి.