కలబందను ఇలా పెడితే మీరెంత అందంగా కనిపిస్తారో..!

Published : May 02, 2023, 02:01 PM IST

కలబందలో బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ముడతలను, మచ్చలను తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది.   

PREV
17
కలబందను ఇలా పెడితే మీరెంత అందంగా కనిపిస్తారో..!

కలబందను ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తారు. కలబందలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. అంతేకాదు వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సహా వివిధ పోషకాలు వడదెబ్బ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే వడదెబ్బకు గురైన చర్మాన్ని నయం చేస్తాయి. కలబంద చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇది మీ చర్మాన్ని మృదువుగా, మెరుగ్గా చేయడానికి సహాయపడుతుంది. కలబంద చర్మానికి రక్షిత పొరగా పనిచేస్తుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. కలబందలో ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరిచే పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.

27

కలబందలో బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం సహజ దృఢత్వాన్ని మెరుగుపరచడానికి, చర్మాన్ని మరింత హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. కలబందలో సాలిసిలిక్ ఆమ్లం కూడా ఉంటుంది. అందుకే కలబంద మొటిమలను, మచ్చలకు  తగ్గిస్తుంది. కలబంద ఒక అద్భుతమైన మాయిశ్చరైజింగ్ పదార్ధం. ఇది చర్మాన్ని ఆర్ద్రీకరణతో నింపుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని పోషిస్తుంది.

37

వేసవిలో సర్వసాధారణమైన చర్మ సమస్యలలో వడదెబ్బ ఒకటి. వడదెబ్బకు గురైన చర్మంపై కలబంద జెల్ ను అప్లై చేయడం వల్ల మంట, ఎరుపు, నొప్పి తగ్గిపోతుంది. కలబందలో పాలిసాకరైడ్లు అనే సమ్మేళనాలు ఉంటాయి.
 

47

వేసవిలో పొడి చర్మాన్ని తేమగా, హైడ్రేట్ గా చేయడానికి కలబందను ఉపయోగించొచ్చు. ఎండ, వేడిలో ఎక్కువ గంటలు ఉండటం వల్ల చర్మం నిర్జలీకరణానికి గురవుతుంది. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. కలబంద అద్భుతమైన నేచురల్ మాయిశ్చరైజర్. ఇది చర్మాన్ని తేమగా,  హైడ్రేట్ గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

57

కలబందను ఇలా ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలు తొలగిపోతాయి...

దీనిలో కొద్దిగా కలబంద జెల్ ను తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై  చేయండి. దీనివల్ల వల్ల మొటిమలు, డ్రై స్కిన్ తొలగిపోతాయి. దీన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయొచ్చు.
 

67

ఈ ప్యాక్ చర్మాన్ని తెల్లగా చేయడానికి, ముఖం, కళ్ల కింద ముడతలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం అలోవెరా జెల్, పసుపు, కొబ్బరి నూనె వేసి బాగా కలపండి. తర్వాత ముఖానికి రాసుకోండి.
 

77

పాలు ముఖాన్ని  తేమను చేయడానికి, చర్మంపై ముడతలను తొలగించడానికి సహాయపడతాయి. అలోవెరా జెల్, పాలు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. కాసేపటి తర్వాత కడిగేసుకోండి.

click me!

Recommended Stories