90 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ రాఖీ పండగ ప్రత్యేకతలేంటో తెలుసా..

First Published | Aug 13, 2024, 4:06 PM IST

అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమనురాగాలకు ప్రతీకగా ఆ రోజు చెల్లి, అక్క వారి సోదరులకు రక్షా బంధన్ కడతారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 19(సోమవారం) నాడు రాఖీ పండగ నిర్వహిస్తారు. ఈ ఏడాది రాఖీ పండగ ప్రత్యేకంగా ఉండబోతోంది. రాఖీ పూర్ణిమ రోజున శక్తివంతమైన గ్రహ సంయోగం జరగబోతోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
 

బ్రదర్‌ బాగుండాలని..

సాధారణంగా తన బ్రదర్‌ బాగుండాలని సిస్టర్‌ రాఖీ కడుతుంది. అదేవిధంగా నీ కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటానని సోదరుడు సోదరిని ఆశీర్వదిస్తూ భరోసా ఇస్తాడు. సాధారణంగా ఇతర సందర్భాల్లోనూ లేడీస్ మగవాళ్లకు రాఖీలు కడుతుంటారు. కేవలం అన్నా చెల్లెల్లే కాకుండా అమ్మ-కుమారుడు, తండ్రి-కూతురు కూడా రక్షాబంధన్ కట్టుకుంటారు.  

ఈ ఏడాది స్పెషల్ ఏంటంటే..

పంచాంగం ప్రకారం 90 సంవత్సరాల తర్వాత ఆ ఘడియలతో ఈ ఏడాది రాఖీ పండగ రాబోతోంది. ఆ రోజున నాలుగు శుభ యోగాలు కలగనున్నాయి.  అందువల్ల ఈ సారి రాఖీ చాలా ప్రత్యేకం కానుంది.  రాఖీ పండగ రోజున శోభ యోగం, శ్రవణ నక్షత్రం, రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం కలిసి మహా సంయోగం 
కానున్నాయి. నక్షతంతో గ్రహాలు కలవడం చాలా అరుదు. అందువల్ల ఆ రోజు రాఖీ కట్టడం అన్నాచెల్లెలి మధ్య సంబంధాన్ని బలపరుస్తుంద‌ని పండితులు అంటున్నారు. 

Latest Videos


భ‌ద్ర కాలంలో రాఖీ క‌ట్ట‌కూడ‌దు..

వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం, భద్ర కాలంలో రాఖీ కట్టకూడదు. భద్ర కాలం ఉంటే పౌర్ణిమకు వచ్చే ముందు తిథి. అంటే చతుర్దశి ఘడియల్లో రాఖీ కట్టడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అందువల్ల రాఖీ పండగ రోజున అంటే సోమవారం మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత రాఖీ కట్టడం మంచిదని తెలిపారు. 

పురాణాల ప్రకారం..

రావణాసురుడు విజయం సాధించాలని ఆయన చెల్లి సూర్పణక(భద్ర) చతుర్దశి ఘడియలు ముగియకముందే హడావుడిగా రాఖీ కట్టిందట. అందువల్ల రావణుడు యుద్ధంలో రాముడి చేతిలో ఓడిపోయాడని ఈ విషయం పురాణాల్లో ఉందని పండితులు చెబుతున్నారు. దీనినే భద్ర కాలం అంటున్నారు. 
 

click me!