ఇలాంటి అమ్మాయిలను అబ్బాయిలు ఎట్టిపరిస్థితిలో వదులుకోరు..

First Published | Mar 10, 2022, 12:34 PM IST

తమ భాగస్వామిగా వచ్చే అమ్మాయిల్లో కొన్ని క్వాలిటీస్ తప్పనిసరిగా ఉండాలని అబ్బాయిలు కోరుకుంటారట. ఆ క్వాలిటీస్ గనుక వారిలో ఉంటే వారిని ఎట్టిపరిస్థితిలో వదులుకోరట. అంతేకాదు ఐదు రకాల లక్షణాలున్న అమ్మాయిల పట్ల అబ్బాయిలు ఎక్కువగా ఆకర్షితులవుతారట.
 

అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా.. తమ భాగస్వామిగా వచ్చే వారిలో కొన్ని రకాల క్వాలిటీస్ తప్పనిసరిగా ఉండాలని కోరకుంటారు. జీవితాంతం తమకు తోడు నీడగా ఉండే భాగస్వామి తమను అన్ని విధాలుగా అర్థం చేసుకుంటే అంతకు మించి కావాల్సింది ఏదీ లేదని భావిస్తారు. అయితే అబ్బాయిల్లో చాలా మంది తమ భాగస్వామి ఉత్తేజకరమైన లక్షణాలున్న స్త్రీల పట్టే ఆకర్షితులవుతారు. 

పనికిరాని విషాయాల గురించి లేదా వారికి సంబందం లేని విషయాల గురించి  కబుర్లు చెప్పుకునే ఆడవారిని అస్సలు ఇష్టపడరు. వాళ్ల వ్యక్తిత్వాన్ని వదులుకునే విషయాల గురించి మాట్లాడే అమ్మాయిలను  ఎట్టిపరిస్థితుల్లో తమ భాగస్వామిగా అంగీకరించరు. ముఖ్యంగా తమ గురించి లేదా సిచ్యువేషన్ కు తగ్గట్టుగా మాట్లాడే అమ్మాయిలంటే అబ్బాయిలకు పిచ్చి. 


తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే ఆడవారంటే అబ్బాయిలకు చాలా ఇష్టం. ఇవే కాకుండా ఇంకొన్ని లక్షణాలున్నఅమ్మాయిలను అబ్బాయిలు ఎక్కువగా ఇష్టడపడతారట. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

ప్రేరణ కలిగించేది..  తప్పులను ఎత్తి చూపకుండా.. లోపాలను చెప్పి..  ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వారిలో స్ఫూర్తిని నింపే అమ్మాయిలను అబ్బాయిలు ఇష్టపడతారు. తమలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి వారిని ఆ దిశగా ప్రోత్సహించే ఆడవారిని పురుషులు ఎట్టి పరిస్థితిలో వదులుకోరు. 
 

ఆకర్షణీయమైనది.. ఎత్తిపొడుపు మాటలు, అవమాన పరిచినట్టుగా మాట్లాడే, తమ గురించి డబ్బా కొట్టుకునే ఆడవారిని పురుషులు ఎట్టి పరిస్థితిలో ఇష్టపడరు. ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె చుట్టూ చేరి ఆమె మాటలను మెచ్చే ఆడవారినే మగవారు కోరుకుంటారు. సామాజిక అంశాలు లేదా ఆధ్యాత్మిక లేద ప్రాపంచిక విషయాల గురించి మాట్లాడే అమ్మాయిలనే ఎక్కువగా ఇష్టపడతారు. 

అతని స్నేహితులు ఇష్టపడే వ్యక్తి..  అబ్బాయిలు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. వాళ్ల స్నేహితులు ఇష్టపడని అమ్మాయిని ప్రేమించడంలో వెనకడుగు వేస్తారట. అంతేకాదు తమ లవర్ లేదా భాగస్వామి ని ఆ అబ్బాయి స్నేహితులు మెచ్చుకుంటే.. అతను చాలా సంతోషంగా ఉంటాడట. ఆ అబ్బాయి స్నేహితులతో సులభంగా కలిసి పోయే అమ్మాయినే అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారు.

ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తి..  జాబ్ పరంగా స్థిరపడిన అబ్బాయి.. తనకొచ్చే భాగస్వామి కూడా స్థిరపడే ఉండాలని భావిస్తారట. అంతేకాదు వారి ఆర్థిక విషయాల్లో బాధ్యత వహించే ఆడవారంటే తెగ ఇష్టపడతారట. ఆర్థిక విషయాల గురించి తెలుసుకుని, వాటి గురించి చర్చించే ఆడవారినే ఎక్కువగా ఇష్టపడతారట.  ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనే సత్తా ఉన్న అమ్మాయిలనే అబ్బాయిలు ప్రేమిస్తారు. 
 

జీవితం కంటే పెద్దది.. తమ భాగస్వామి ఎలాంటి విషయాల్లో తప్పు చేస్తున్నారు.. వారు జీవితంలో ఏం కోల్పోతున్నారు వంటి విషయాలను ఎప్పటికప్పుడు చెప్పే అమ్మాయిలతోనే అబ్బాయిలు తొందరగా ప్రేమలో పడే ఛాన్స్ ఉంది.  

Latest Videos

click me!