దేశంలోనే అత్యంత అందమైన రైల్వే స్టేషన్లు ఇవే... ఆ ప్రయాణం కన్నులపండగే

First Published | Sep 14, 2024, 10:46 PM IST

ఆ మార్గంలో మీరు రైలు ప్రయాణం చేసారంటే అదే జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతిగా మిగిలిపోతుంది. అంతటి అందమైన రైల్వే మార్గాల గురించి తెలుసుకుందాం. 

అందమైన రైల్వే స్టేషన్

విమానాలు, బస్సులు, కార్లలో ప్రయాణంకంటే రైలులో ప్రయాణిస్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. సాధారణంగానే రైలు ప్రయాణం హాయిగా వుంటుంది... అదే కొండల మధ్య పచ్చగా పరుచుకున్న ప్రకృతి అందాలు, పంటపొలాలు, అంతెత్తునుండి జాలువారుతున్న జలపాతాల మధ్యన రైలు ప్రయాణిస్తుంటే... కిటికీ పక్కన కూర్చుని ఆ అందాలను ఆస్వాదిస్తుంటే కలిగే అనుభూమి మాటల్లో చెప్పలేం.  

ఇలా జీవితాంతం గుర్తిండిపోయే రైలు ప్రయాణాలు కొన్ని వుంటాయి. ఇలా అందాలతో కనువిందు చేసే  రైల్వే స్టేషన్లు, రైలు మార్గాల గురించి తెలుసుకుందాం. 

అంతేకాకుండా, భారతదేశంలోని భూభాగాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి మరియు రైలులో ప్రయాణించడం దేశవ్యాప్తంగా సహజ దృశ్యాలను అనుభవించడానికి ఉత్తమ మార్గం. అయితే, మీరు రైలు ద్వారా వివిధ ప్రదేశాలకు ప్రయాణించి ఉండవచ్చు, కానీ భారతదేశంలోని అత్యంత అందమైన రైల్వే స్టేషన్లు ఏమిటో మీకు తెలుసా? ఈ పోస్ట్‌లో దీని గురించి చూద్దాం.

అందమైన రైల్వే స్టేషన్

కార్వార్ రైల్వే స్టేషన్, కర్ణాటక

దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ అద్భుతమైన సహజ అందాలతో కూడిన అనేక  పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇలా రాష్ట్రంలోని కార్వార్ రైల్వే స్టేషన్ భారతదేశంలోనే అత్యంత అందమైన రైల్వే స్టేషన్. కార్వార్ నగరంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ కర్ణాటక, మహారాష్ట్రల రాజధానులు బెంగళూరు, ముంబైలను కలిపే ప్రధాన రైలు మార్గంలో వస్తుంది.

1857లో బ్రిటిష్ వారు స్థాపించిన కార్వార్‌ను సాధారణంగా "కర్ణాటక కాశ్మీర్" అని పిలుస్తారు. ఢిల్లీ, జైపూర్, ఇండోర్, ఎర్నాకులం, కోయంబత్తూర్ వంటి ఇతర నగరాలను కూడా కలిపేది ఈ స్టేషనే. ఈ స్టేషన్ ను, పరిసర ప్రాంతాలను  వర్షాకాలంలో చూస్తే మైమరచిపోవడం ఖాయం. 

హఫ్లాంగ్ రైల్వే స్టేషన్, అస్సాం

భారతీయ రైల్వే ద్వారా "గ్రీన్ రైల్వే స్టేషన్"గా గుర్తింపుపొందిన హఫ్లాంగ్ రైల్వే స్టేషన్ అస్సాంలోని డిమా హసావో జిల్లాలో ఉంది. హఫ్లాంగ్‌ను గౌహతి, సిల్చార్‌లను కలుపుతుంది. అస్సాంలోని పచ్చని కొండల మధ్య వున్న ఈ అందమైన స్టేషన్ నిజంగా కనువిందు చేస్తుంది.

పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం, ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులను అమలు చేయడం వంటి అనేక పర్యావరణ హిత కార్యకలాపాలతోో కూడా హప్లాంగ్ స్టేషన్ ప్రత్యేక గుర్తింపు పొందింది.  


అందమైన రైల్వే స్టేషన్

దూద్ సాగర్ రైల్వే స్టేషన్, గోవా

భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో గోవా ఒకటి అనడంలో సందేహం లేదు. గోవాలోని ప్రసిద్ధ బీచ్‌లు దేశీయంగానే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా ఆకర్షిస్తాయి. ఇలాంటి అందమైన గోవాలో అంతకంటే అందమైన  దూద్ సాగర్ రైల్వే స్టేషన్ వుంది. దేశంలో ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన రైల్వే స్టేషన్లలో ఇదీ ఒకటి.  

గోవా, కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ స్టేషన్ప్ర యాణికులకు పశ్చిమ కనుమల యొక్క అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రీకరణ కూడా దూద్ సాగర్ జలపాతం సమీపంలో జరిగింది, అప్పటి నుండి ఇక్కడికి పర్యాటకుల సంఖ్య పెరిగింది. 

అందమైన రైల్వే స్టేషన్

కథగోడం రైల్వే స్టేషన్, ఉత్తరాఖండ్

అందమైన కొండలతో చుట్టుముట్టబడిన ఉత్తరాఖండ్‌లోని కథగోడం రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అందాలతో కట్టిపడేస్తుంది. డెహ్రాడూన్,  కథగోడంలను కలిపే ఈ స్టేషన్ దేశంలోని పచ్చని రైల్వే స్టేషన్లలో ఒకటి. ప్రకృతి ప్రేమికులు తప్పక చూడవలసిన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇది సౌర విద్యుత్, వర్షపునీటి సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ సౌకర్యాలు వంటి వివిధ సౌకర్యాలను కలిగివుంది. 

న్యూఢిల్లీ-కథగోడం శతాబ్ది ఎక్స్‌ప్రెస్, లక్నో జంక్షన్-కథగోడం ఎక్స్‌ప్రెస్, రానిఖేత్ ఎక్స్‌ప్రెస్, ఉత్తరాఖండ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఈ స్టేషన్ గుండా వెళ్ళే కొన్ని ప్రసిద్ధ రైళ్ళు.

అందమైన రైల్వే స్టేషన్

షిమ్లా రైల్వే స్టేషన్, హిమాచల్ ప్రదేశ్

భారతదేశంలోని అత్యంత సుందరమైన ప్రకృతి అందాలగురించి మాట్లాడేటప్పుడు తప్పకుండా వచ్చేపేరు షిమ్లా. ఇది దేశంలోని అత్యంత సందర్శించదగిన హిల్ స్టేషన్లలో ఒకటి అనడంలో సందేహం లేదు. షిమ్లా అందాల్లో అక్కడి రైల్వే స్టేషన్ హైలైట్ గా నిలుస్తుంది. షిమ్లా సందర్శనకు వెళ్లినవారు తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఇదీ ఒకటి. ఈ స్టేషన్ అందమైన కొండలు, పచ్చని అడవులతో చుట్టుముట్టబడి ఉంది.

భారతీయ రైల్వే స్టేషన్ చుట్టూ పచ్చదనాన్ని కాపాడుకోవడానికి చెట్లను నాటడం, సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం,  రీసైక్లింగ్, వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడం వంటి అనేక చర్యలు తీసుకుంది. ఈ స్టేషన్‌లో వర్షపునీటి సంరక్షణ వ్యవస్థ కూడా ఉంది, ఇది భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. షిమ్లా రైల్వే స్టేషన్ దేశంలోని అత్యంత సుందరమైన రైల్వే స్టేషన్లలో ఒకటిగా పరిగణించబడుతుంది.

Latest Videos

click me!