15 రోజుల వ్యవధిలో 2 గ్రహణాలు: చాలా అరుదైన ఈ గ్రహణాలు భారతదేశంలో కనిపిస్తాయా?

First Published | Aug 27, 2024, 5:56 PM IST

సూర్య,చంద్ర గ్రహణాలు మనకు చాలా ప్రత్యేకం. ఎప్పుడో  సంవత్సరానికి ఒకసారి వస్తాయి. కాని 2024 సంవత్సరంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వరుసగా చంద్ర, సూర్య గ్రహణాలు కేవలం 15 రోజుల గ్యాప్ లో ఏర్పడనున్నాయి. 

సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు?

2024 సెప్టెంబర్ లో చంద్ర గ్రహణం, అక్టోబర్‌లో సూర్య గ్రహణం ఏర్పడనున్నాయి. ఈ రెండు గ్రహణాలు 15 రోజుల వ్యవధిలోనే కనిపిస్తాయి. హిందువులకు చంద్ర, సూర్య గ్రహణాలు చాలా ప్రత్యేకమైన సంఘటనలు. మతం, జ్యోతిష్యశాస్త్రాల పరంగా వీటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. 2024 సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో వరుసగా 2 గ్రహణాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. 2024లో సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు వస్తున్నాయి, వాటికి సంబంధించిన ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం..

సెప్టెంబర్ 2024లో గ్రహణం ఎప్పుడు?

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, 2024 సంవత్సరంలో చంద్రగ్రహణం సెప్టెంబర్ 18 బుధవారం నాడు ఏర్పడుతుంది. ఇది ప్రపంచంలోని అనేక దేశాల్లో కనిపిస్తుంది. భారతీయ కాలమానం ప్రకారం, ఈ గ్రహణం సెప్టెంబర్ 18న బుధవారం ఉదయం 06:11 గంటలకు ప్రారంభమై ఉదయం 10:17 గంటలకు ముగుస్తుంది. అంటే ఈ గ్రహణం వ్యవధి 04 గంటల 06 నిమిషాలు ఉంటుంది.

Latest Videos


ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా?

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, సెప్టెంబర్ 18, 2024న ఏర్పడే చంద్రగ్రహణం ఉత్తర-దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం, ఆర్క్టిక్ యూరప్, ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఈ గ్రహణం కనిపించే దేశాల్లో మాత్రమే సూతకం చెల్లుతుంది. సూతకం చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు ప్రారంభమవుతుంది

అక్టోబర్ 2024లో గ్రహణం ఎప్పుడు?

శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, 2024 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2 బుధవారం నాడు ఏర్పడుతుంది. ఈ రోజు ఆశ్వయుజ మాసం అమావాస్య. ఇది కంకణాకార సూర్యగ్రహణం అవుతుంది. ఈ గ్రహణంలో సూర్యుడు బ్రాస్లెట్ లేదా గోళం రూపంలో ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తాడు. అందుకే దీనిని కంకణాకార సూర్యగ్రహణం అంటారు. భారతీయ కాలమానం ప్రకారం, ఈ సూర్యగ్రహణం అక్టోబర్ 2 బుధవారం రాత్రి 09:13 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 03:17 గంటలకు ముగుస్తుంది.

ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా?

అక్టోబర్ 2 బుధవారం ఏర్పడే సూర్యగ్రహణం దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, అర్జెంటీనా, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం మొదలైన దేశాల్లో కనిపిస్తుంది. కానీ ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. కాబట్టి దాని సూతకం ఇక్కడ చెల్లదు. ఈ గ్రహణం కనిపించే దేశాల్లో మాత్రమే సూతకం చెల్లుతుంది. ఇది సూర్యగ్రహణం ప్రారంభానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది.

నిరాకరణ
ఇందులో ఇవ్వబడిన సమాచారం అంతా జ్యోతిష్యులు, పంచాంగం, శాస్త్రాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. మేము ఈ సమాచారాన్ని మీకు అందించడానికి ఒక మాధ్యమం మాత్రమే. వినియోగదారులు ఈ సమాచారాన్ని సమాచారంగా మాత్రమే పరిగణించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము.

click me!