అతన్ని వదిలి తప్పు చేశారు, వేలంలో తిరిగి కొనడం... యజ్వేంద్ర చాహాల్‌పై మాజీ క్రికెటర్ కామెంట్...

First Published Dec 3, 2021, 12:53 PM IST

ఐపీఎల్ 2022 రిటెన్షన్స్‌లో విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, మహ్మద్ సిరాజ్‌లను అట్టిపెట్టుకున్న ఆర్‌సీబీ, యజ్వేంద్ర చాహాల్‌ను వేలానికి వదిలేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది...

2011 నుంచి రెండు సీజన్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన యజ్వేంద్ర చాహాల్, 2014లో ఆర్‌సీబీకి వచ్చిన తర్వాతే గుర్తింపు తెచ్చుకుని, టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు...

గత ఏడేళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీ ప్లేయర్‌గా మారిన యజ్వేంద్ర చాహాల్, మొత్తంగా 113 మ్యాచుల్లో 139 వికెట్లు తీసి అదరగొట్టాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫస్టాఫ్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయినా, సెకండాఫ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన చాహాల్, 15 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టాడు...

‘యజ్వేంద్ర చాహాల్ లాంటి ప్లేయర్‌ను వేలానికి వదలడం చాలా పెద్ద రిస్క్. కచ్ఛితంగా ఆర్‌సీబీ, తిరిగి చాహాల్‌ను కొనుగోలు చేయాలని చూస్తుంది. ఐపీఎల్‌లో అతనికి మంచి రికార్డు కూడా ఉంది...

అయితే చాహాల్‌ను వేలంలో కొనుగోలు చేయాలంటే టీమ్ భారీగా ఖర్చు పెట్టాల్సిందే. నా అంచనా ప్రకారం రిటైన్ చేసుకుంటే చాహాల్ పొందే దాని కంటే, వేలంలో రెట్టింపు రావచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్...

‘సీఎస్‌కేలో రవిచంద్రన్ అశ్విన్ స్టార్ స్పిన్నర్‌గా ఎదిగితే, ఆర్‌సీబీ చాహాల్‌ను స్టార్‌గా మార్చింది. చాహాల్‌ను తిరిగి టీమ్‌లోకి రప్పించాలని ఆర్‌సీబీ ప్రయత్నిస్తుంది. దీన్ని వాడుకుని మిగిలిన జట్లు, చాహాల్‌కి భారీ ధర చెల్లించడానికి సిద్ధపడొచ్చు..

చాహాల్‌కి ఇది లాభసాటి వ్యవహారమే. ఐపీఎల్ 2022 సీజన్‌ రిటెన్షన్, విదేశీ ప్లేయర్ల కంటే స్వదేశీ ప్లేయర్లే ఎక్కువగా రిటైన్ కావడం చాలా మంచి పరిణామమే...

భారత క్రికెటర్లకు ఇది చాలా చక్కని అవకాశం. విదేశీ ప్లేయర్ల, ఫ్రాంఛైజీలకు అవసరమైన స్టార్ డమ్‌ తెస్తారమే కానీ, జట్టు టైటిల్ గెలవాలంటే స్వదేశీ ప్లేయర్లే కీలకం...

దేశానికి ఆడడమే ఏ ప్లేయర్‌కైనా అత్యంత ప్రాధాన్యమైన విషయం. ఐపీఎల్‌లో ఆడాలని అనుకోకుండా, దేశానికి ఆడాలని కలలు కనాలి. బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్ వంటి ప్లేయర్లు ఆడడం మొదలెట్టినప్పుడు ఐపీఎల్ లేదు...

వాళ్లిద్దరూ కూడా తమ తమ దేశాల తరుపున ఆడాలని కష్టపడి రాణించి వచ్చినవాళ్లే. ఐపీఎల్ రిటెన్షన్‌ను రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి రిటైన్ అయిన ప్లేయర్లు భద్రత పీల్ అవుతారు...

అలాగే రిటైన్ కాని ప్లేయర్లు, అవకాశం దొరికిందని ఆశపడతారు.. అంతే తప్ప, ఇందులో బాధపడాల్సిందేమీ లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృ‌ష్ణన్...

click me!