యూ‌పి‌పి‌ఎస్‌సి పి‌సి‌ఎస్ ప్రిలిమ్స్ ఆన్సర్ కీ విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి

First Published | Oct 29, 2021, 11:10 AM IST

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  యూ‌పి‌పి‌ఎస్‌సి  పి‌సి‌ఎస్ (UPPSC PCS) ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2021 విడుదలైంది. అభ్యర్థులు అధికారిక యూ‌పి‌పి‌ఎస్‌సి  వెబ్‌సైట్ uppsc.up.nic.inలో ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

కంబైన్డ్ స్టేట్/అప్పర్ సబార్డినేట్ సర్వీసెస్ (ప్రీ.) అసిస్ట్. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్/రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ సర్వీసెస్ (ప్రీ.) EXAM – 2021 ఆన్సర్ కీ  2 నవంబర్  2021 వరకు అందుబాటులో ఉంటుంది. 

యూ‌పి‌పి‌ఎస్‌సి  పి‌సి‌ఎస్ (UPPSC PCS) ప్రిలిమ్స్ రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 1,505 కేంద్రాలలో 24 అక్టోబర్ 2021న రెండు షిఫ్టులలో నిర్వహించింది. ఈ ఏడాది 6.91 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. 

యూ‌పి‌పి‌ఎస్‌సి  పి‌సి‌ఎస్ ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2021: డౌన్‌లోడ్ చేయడానికి 

1. uppsc.up.nic.inలో అధికారిక UPPSC వెబ్‌సైట్‌ను సందర్శించండి

2. హోమ్‌పేజీలో UPPSC PCS ప్రిలిమ్స్ ఆన్సర్ కీ 2021 లింక్‌పై క్లిక్ చేయండి 

3. ఆన్సర్ కీ స్క్రీన్‌పై కనిపిస్తుంది

4. భవిష్యత్తు అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌అవుట్ తీసుకోండి

అభ్యర్థులు 3 నవంబర్ 2021 లేదా అంతకు ముందు అధికారిక సైట్ ద్వారా  ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చని అధికారిక నోటీసులో పేర్కొంది. అభ్యర్ధులు అభ్యంతరాలను  తెలిపేందుకు ప్రతి ప్రశ్నకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 

click me!