తెలంగాణలో మహిళలకు గుడ్‌న్యూస్‌.. 10th అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు..

First Published | Oct 23, 2021, 4:59 PM IST

పడవ తరగతి పాసై  ఉద్యోగం చేయాలని కోరుకునే వారికి లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త. తాజాగా అంగన్‌వాడీ(anganwadi) పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి డిపార్ట్‌మెంట్ ఫర్ వుమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్‌ఫేర్(child welfare) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం  164 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అంగన్వాడీ టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఊన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పోస్టులకు సంబంధించి అక్టోబర్ 27 ధరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది. మహిళలు(womens) మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు అప్లయ్‌ చేసే అభ్యర్థులు స్థానికులై ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.  

మొత్తం ఖాళీలు: 164
అంగన్వాడీ టీచర్- 29
మినీ అంగన్వాడీ టీచర్- 12
అంగన్వాడీ హెల్పర్-123
విద్యార్హతలు: అభ్యర్థులు 10వ తరగతి పాస్ కావాలి. అభ్యర్థులు స్థానికంగా నివసిస్తున్నవారై ఉండాలి.
వయస్సు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 27 అక్టోబర్ 2021
ఎంపిక విధానం: మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.


1. https://mis.tgwdcw.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి 
2. హోమ్ పేజీలో Please Click Here to Fill your Application Form అనే లింక్ పైన క్లిక్ చేయాలి.
3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మొదటి సెక్షన్‌లో అప్లయ్‌ చేసే పోస్ట్ పేరు, అంగన్వాడీ సెంటర్ వివరాలు ఎంటర్ చేయాలి.
4. రెండో సెక్షన్‌లో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్ ఎంటర్ చేయాలి.
5. మూడో సెక్షన్‌లో క్యాస్ట్ వివరాలు ఎంటర్ చేసి క్యాస్ట్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.
6. నాలుగో సెక్షన్‌లో ఎస్ఎస్‌సీ పాస్ అయిన సంవత్సరం, మార్కుల వివరాలు ఎంటర్ చేసి, టెన్త్ మెమో అప్‌లోడ్ చేయాలి.
7. తర్వాతి సెక్షన్‌లో ఇతర విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
8. చివరి సెక్షన్‌లో ఇతర వివరాలు సెలెక్ట్ చేసి సంబంధిత సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.
9. ప్రివ్యూ ఆప్షన్‌ పైన క్లిక్ చేసి వివరాలన్నీ సరిచూసుకుని అప్లికేషన్‌ ఫామ్‌ సబ్‌మిట్‌ చేయాలి.

Latest Videos

click me!