TGPSC Jobs Notification 2026 : తెలుగు యువతకు బంపరాఫర్.. స్టార్టింగే నెలనెలా రూ.54,220 శాలరీతో ప్రభుత్వ ఉద్యోగం

Published : Jun 20, 2026, 04:12 PM IST

తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. తాజాగా విద్యాశాఖలో లెక్చరర్, సీనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది.

PREV
17
టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్

Government Jobs Notification 2026 : ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని భావిస్తున్న తెలంగాణ యువతీయువకులకు ఇదే మంచి సమయం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఇప్పటికే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.. తాజాగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఖాళీల భర్తీకి సిద్దమయ్యింది. DIET (డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్) లో 86 లెక్చరర్, సీనియర్ లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు? దరఖాస్తు ప్రక్రియ, ఎగ్జామ్ ప్రాసెస్ ఏంటి? శాలరీ ఎంతుంటుంది? ఇలాంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

27
లెక్చరర్, సీనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ

పోస్ట్ : స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ (DIET) లో లెక్చరర్, సీనియర్ లెక్చరర్ పోస్టులు

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్ 

TGPSC అధికారిక వెబ్ సైట్ https://www.tgpsc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ఏ పద్దతిలో దరఖాస్తుకు అనుమతి లేదు.

దరఖాస్తు తేదీలు 

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 24-06-2026

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 29-07-2026 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

దరఖాస్తు ఫీజు :

ఓసి, బిసిలకు రూ.1000

ఎస్సి, ఎస్టి, పిడబ్ల్యుడి రూ.500

ప్రతి అభ్యర్థి ఎగ్జామినేషన్ ఫీజు రూ.120 చెల్లించాలి

37
సీనియర్ లెక్చరర్, లెక్చరర్ ఉద్యోగాలకు ఎగ్జామినేషన్ ప్రాసెస్

రాతపరీక్ష సెప్టెంబర్ 2026 ఉంటుంది. ఏ తేదీతో పరీక్ష నిర్వహిస్తారో త్వరలోనే వెల్లడిస్తారు.

హాల్ టికెట్స్ పరీక్షకు ఏడు రోజుల ముందునుండి ఆన్ లైన్ లో తీసుకోవచ్చు. ఎగ్జామ్ కు ముందురోజు సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.

ఎగ్జామ్ సెంటర్లు

హైదరాబాద్ (HMDA పరిధిలో)

కరీంనగర్

ఖమ్మం

నిజామాబాద్

వరంగల్

 ఎగ్జామ్ ప్రాసెస్

రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది.

పేపర్ 1 

జనరల్ స్టడీస్ ఆండ్ జనరల్ ఎబిలిటీస్ - 150 ప్రశ్నలకు 150 మార్కులు - 150 నిమిషాల సమయం (ఇంగ్లీష్, తెలుగులో ప్రశ్నపత్రం ఉంటుంది)

పేపర్ 2

పార్ట్-ఎ , పార్ట్-బి గా విభజించారు. పార్ట్-ఏ లో 75 ప్రశ్నలకు 150 నిమిషాల సమయం, 150 మార్కుల ఉంటాయి. అంటే ఒక్క జవాబుకు 2 మార్కులు అన్నమాట. పార్ట్-బి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది... 75 ప్రశ్నలకు 150 నిమిషాల సమయం, 150 మార్కులు. (ఇంగ్లీష్, తెలుగులో ప్రశ్నపత్రం ఉంటుంది)

47
స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భర్తీచేసే పోస్టుల వివరాలు

స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మొత్తం 86 లెక్చరర్, సీనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది జోన్ల వారిగా ఖాళీలు చూసుకుంటే ఇలా ఉన్నాయి.

మల్టీ జోన్ - 1

సీనియర్ లెక్చరర్, DIET ప్రీ ప్రైమరీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్/ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ ఫీల్డ్ ఇంటరాక్షన్ ఇన్నోవేషన్ & కోఆర్డినేషన్/ డిస్ట్రిక్ రీసోర్స్ యూనిట్/ ప్లానింగ్ & మేనేజ్మెంట్ / ఎడ్యుకేషనల్ టెక్నాలజీ / వర్క్ ఎక్సిపియరెన్స్ / కరిక్యులమ్ మెటీరియల్ డెవలప్మెంట్ & ఎవాల్యుయేషన్ - 17 పోస్టులు

లెక్చరర్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఫీల్డ్ ఇంటరాక్షన్ ఆండ్ కోఆర్డినేషన్, వర్క్, ఎక్స్పియరెన్స్, కరిక్యులమ్ మెటీరియల్ డెవలమ్మెంట్ & ఎవాల్యుయేషన్ ఆండ్ డిస్ట్రిక్ రిసోర్స్ యూనిట్ (DRU) - 07 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ (ఉర్దూ మీడియం) - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ తెలుగు - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఉర్దూ - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ మ్యాథ్స్ - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ సైన్స్ - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ సైన్స్ (ఉర్దూ మీడియం) - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ సోషల్ స్టడీస్ - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ సోషల్ స్టడీస్ (ఉర్దూ మీడియం) - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఫిలాసఫీ - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ సైకాలజీ - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ ప్లానింగ్ ఆండ్ స్టాటిస్టిక్ - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ - 02 పోస్టులు

మల్టీ జోన్ - 2

సీనియర్ లెక్చరర్, DIET ప్రీ ప్రైమరీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్/ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్ ఫీల్డ్ ఇంటరాక్షన్ ఇన్నోవేషన్ & కోఆర్డినేషన్/ డిస్ట్రిక్ రీసోర్స్ యూనిట్/ ప్లానింగ్ & మేనేజ్మెంట్ / ఎడ్యుకేషనల్ టెక్నాలజీ / వర్క్ ఎక్సిపియరెన్స్ / కరిక్యులమ్ మెటీరియల్ డెవలప్మెంట్ & ఎవాల్యుయేషన్ - 06 పోస్టులు

లెక్చరర్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఫీల్డ్ ఇంటరాక్షన్ ఆండ్ కోఆర్డినేషన్, వర్క్, ఎక్స్పియరెన్స్, కరిక్యులమ్ మెటీరియల్ డెవలమ్మెంట్ & ఎవాల్యుయేషన్ ఆండ్ డిస్ట్రిక్ రిసోర్స్ యూనిట్ (DRU) - 09 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ (ఉర్దూ మీడియం) - 02 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ - 03 పోస్టులు

లెక్చరర్ ఇన్ తెలుగు - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఉర్దూ - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ మ్యాథ్స్ - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ సైన్స్ - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ సోషల్ స్టడీస్ - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఫిలాసఫీ - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ సైకాలజీ - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ ప్లానింగ్ ఆండ్ స్టాటిస్టిక్ - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ - 01 పోస్టులు

లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ - 01 పోస్టులు

57
సీనియర్ లెక్చరర్, లెక్చరర్ ఉద్యోగాలకు వయోపరిమితి

18 నుండి 44 ఏళ్లలోపువారు అర్హులు

వయోపరిమితి సడలింపు

ఎస్సి,ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ - 5 ఏళ్ల సడలింపు

దివ్యాంగులు - 10 ఏళ్ల సడలింపు

ప్రభుత్వ ఉద్యోగులు (కార్పోరేషన్స్, మున్సిపాలిటీ ఉద్యోగులకు వర్తించదు) - 5 ఏళ్లు సడలింపు

మాజీ సైనికులు - 3 ఏళ్లు

NCC - 3 ఏళ్లు సడలింపు

67
సీనియర్ లెక్చరర్, లెక్చరర్ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హతలు

లెక్చరర్, సీనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి వివిధ సబ్జెక్టులను బట్టి విద్యార్హతలు ఉంటాయి. సంబంధిత సబ్జెక్ట్స్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. చాలా పోస్టులకు M.Ed కూడా తప్పనిసరి. ఏ పోస్టుకు ఏ విద్యార్హతలు అవసరమో తెలియాలంటే నోటిఫికేషన్ ను పరిశీలించండి.

77
సీనియర్ లెక్చరర్, లెక్చరర్ ఉద్యోగాల శాలరీ

తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో సీనియర్ లెక్చరర్, లెక్చరర్ ఉద్యోగాలు స్టేట్ లెవెల్ కి చెందినవి. అంటే మంచి శాలరీ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలనెలా రూ.54,220 నుండి రూ.1,33,630 వరకు జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories