అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏయే విభాగంలో ఏయే పోస్టులు ఉన్నాయో బోర్డు క్లియర్‌గా అనౌన్స్ చేసింది. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సివిల్ కానిస్టేబుల్స్ అత్యధికంగా 3,697 పోస్టులు ఉండగా, ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్స్ 1,052 ఉన్నాయి. అలాగే మోస్ట్ పవర్‌ఫుల్ సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు 148 ఉన్నాయి. వీటికి తోడు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (FPB) 23, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (AR) 14, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (TGSP) 12 ఖాళీలు ఉన్నాయి. డ్రైవర్ (PTO) 20, మెకానిక్ (PTO) 7, కానిస్టేబుల్ (SARCPL) 24, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SARCPL) 3 పోస్టులు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.
ఇక మిగిలిన శాఖల విషయానికి వస్తే, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) లో కానిస్టేబుల్స్ 1,380, సబ్ ఇన్‌స్పెక్టర్స్ 44 ఉన్నాయి. ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో ఫైర్ ఫైటర్స్ 751, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ 39 పోస్టులు భర్తీ కానున్నాయి. అటు జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ (మెన్) 14, డిప్యూటీ జైలర్ (వుమెన్) 1, వార్డర్ (మెన్) 196, వార్డర్ (వుమెన్) 12 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.