డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. జీతంతో ఇతర అలవెన్సులు కూడా.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

First Published | Oct 20, 2021, 5:37 PM IST

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుడ్‌న్యూస్‌. ఐబీసీఎస్‌(ibps), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఈ నోటిఫికేషన్ల ద్వారా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 10,517 క్లర్క్‌, ప్రొబేషనరీ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నాయి. 

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఉన్న 7855 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు అక్టోబర్‌ 27లోగా చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.ibps.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం పోస్టులు: 7855
అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. అదేవిధంగా స్థానిక భాష రాయడం, చదవడం తెలిసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్‌ ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు రూ. 175.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్‌ 7, 2021
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 27, 2021
ప్రిలిమ్స్‌ పరీక్ష: డిసెంబర్‌ 2021
మెయిన్స్‌: వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి
వెబ్‌సైట్‌: https://www.ibps.in/

Latest Videos

click me!