సికింద్రాబాద్, కాజిపేట్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో ఉన్న రైల్వే యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేయడానికి నవంబర్ 3 చివరితేది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం గురించి https://scr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.
jobs
విద్యార్హతలు:
దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి. 10+2 విధానంలో చదివి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (SCVT) గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయస్సు 2021 అక్టోబర్ 4 నాటికి 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్‌లో ఐటీఐ ఎగ్జామ్‌లో సాధించిన మార్కులకు సమాన వెయిటేజ్ ఇచ్చి మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే ఎక్కువ వయస్సు ఉన్నవారిని పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ పుట్టిన తేదీ కూడా ఒకేలా ఉంటే 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఎవరు ముందు పాస్ అయ్యారన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు.