తిరుపతి ఐఐటీలో ఉద్యోగాలు.. నెలకు లక్షకు పైగా జీతం.. వెంటనే అప్లయి చేసుకోండీ..

First Published | Nov 18, 2021, 3:10 PM IST

ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలుగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐఐటీ తిరుపతి (IIT tirupathi)ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఇప్పుడు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ ద్వారా పలు విభాగాల్లో ఉన్న ఖాళీగా టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

భర్తీ చేయనున్న పోస్టులు 
నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు గ్రేడ్‌-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో కెమికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటస్టిక్స్‌, ఫిజిక్స్‌, హ్యుమానిటిస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.


అర్హతలు
 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేన్లలో పీహెచ్‌డీ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు టీచింగ్‌/ రిసెర్చ్‌/ ఇండస్ట్రియల్‌ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
 

అర్హత వయస్సు
అభ్యర్థుల వయసు 38 ఏళ్లు మించకూడదు. ఎస్సీలకు ఐదేళ్లు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు ఐదేళ్లు సడలింపు ఉంది.

దరఖాస్తు విధానం
 అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ముందుగా అకడమిక్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా చివరి ఎంపిక ఉంటుంది.
 


జీతం
టీచింగ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 1,01,500లతో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.

 ధరఖాస్తులకు చివరి తేదీ: దరఖాస్తుల చేసుకోవడానికి చివరి తేదీ 24-12-2021.

 పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Videos

click me!