AIMA MAT 2021 అడ్మిట్ కార్డ్ విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి

First Published Nov 18, 2021, 12:33 PM IST

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) నవంబర్ 17న మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (MAT 2021) అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది.

 ఎం‌ఏ‌టకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (MAT CBT)గా హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mat.aima.in లో వారి అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు వారి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయవలసి ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటన ప్రకారం  "అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల రాయ్‌పూర్, డెహ్రాడూన్, గౌహతి, తిరువంతపురం, కోజికోడ్ & తిరుచ్చిలను  మొదటి ప్రాధాన్యతగా ఎంచుకున్న అభ్యర్థులకు అడ్మిట్ కార్డ్‌లు 18.11.2021న  సాయంత్రం 4 గంటలకి విడుదల చేయబడతాయి.  
 

Latest Videos


MAT 2021 CBT అడ్మిట్ కార్డ్: డౌన్‌లోడ్ చేయడం ఎలా

మొదట అధికారిక వెబ్‌సైట్‌  mat.aima.inకి వెళ్లండి

హోమ్‌పేజీలో, 'download CBT admit cards' లింక్‌పై క్లిక్ చేయండి

కొత్త లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది

మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ  కీగా ఉంటుంది

'submit'పై క్లిక్ చేయండి

MAT 2021 అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది

అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి

భవిష్యత్ సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి

అభ్యర్థులు తప్పనిసరిగా MAT అడ్మిట్ కార్డ్‌లో పేరు, ఫారమ్ నంబర్, రోల్ నంబర్, పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం, చిరునామాను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థులకు కేటాయించిన తేదీ, సమయాన్ని అనుసరించడం తప్పనిసరి.

అభ్యర్థులు MAT 2021 అడ్మిట్ కార్డ్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్‌ను MAT పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. AIMA నవంబర్ 21న MAT 2021ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌గా నిర్వహిస్తుంది.

click me!