గుడ్ న్యూస్ బీటెక్‌ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

First Published Nov 13, 2021, 7:16 PM IST

బీటెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధరప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఏదైనా  బీటెక్ లేదా బీఈ చదివి పాసైన వారు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్‌ విభాగంలో 6 అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. 

అయితే ఈ పోస్టులకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్‌ను కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది.

ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 12 దరఖాస్తులకు చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హత వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
 

మొత్తం ఖాళీలు: 6
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ లేదా బీటెక్‌ (సివిల్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 1 జూలై 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.250 అప్లికేషన్ ఫీజు, రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌ రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే చాలు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
వేతనం: రూ.37,100 బేసిక్ వేతనంతో మొత్తం రూ.91,450 వేతనం లభిస్తుంది.
 దరఖాస్తుకు చివరి తేదీ: 12 నవంబర్ 2021

ధరఖాస్తు ఎలా చేసుకోవాలంటే 
మొదటగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్  పైన క్లిక్ చేయాలి.
తరువాత  న్యూ రిజిస్ట్రేషన్  పైన క్లిక్ చేయాలి.
అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
తరువాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ కావాలి.
ఆన్ లైన్ అప్లికేషన్ సబ్మిషన్  పైన క్లిక్ చేయాలి.
యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి దరఖాస్తు ఫామ్‌ ప్రింట్‌ తీసుకుని ఉంచుకోవాలి.
 

click me!