ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 520 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 23 వరకు అందుబాటులో ఉంటాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు కోల్‌కతా కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.rrcser.co.in/ వెబ్‌సైట్ చూడవచ్చు.
మొత్తం ఖాళీ పోస్టులు: 520 వీటిలో జనరల్- 277, ఓబీసీ- 87, ఎస్‌సి- 126, ఎస్‌టి- 30 కేటాయించారు.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు అర్హులు.
వయసు: అభ్యర్థుల వయసు 42 ఏళ్ల లోపువారై ఉండాలి(ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోతవిధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: 23 డిసెంబర్ 2021
అధికారిక వెబ్‌సైట్:https://www.rrcser.co.in/
సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) రిక్రూట్‌మెంట్ 2021కి ఎలా దరఖాస్తు చేయాలి?
మొదట SER.ierrcser.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
GDSE కోసం పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేయండి.
అప్లికేషన్ పోర్టల్‌లో పేర్కొన్న దశలను అనుసరించి వివరాలను నింపండి
డాక్యుమెంట్ ప్రూఫ్ అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తును నింపడానికి అభ్యర్థులు వారి మొబైల్ నంబర్, ఇమెయిల్ చిరునామాను ఎంటర్ చేయాలని సూచించారు.
వివరాలను నింపిన తర్వాత, డిక్లరేషన్‌కు సంబంధించి ప్రివ్యూ బటన్‌పై క్లిక్ చేయండి.
దరఖాస్తుదారులు ప్రివ్యూ బటన్‌ను ఉపయోగించి వివరాలను మరోసారి చూడవచ్చు.
దరఖాస్తుదారులు దరఖాస్తును సబ్మిట్ చేసిన తర్వాత ఆన్‌లైన్ వెరిఫికేషన్ కోసం సంబంధిత విభాగాలు/యూనిట్‌లు/వర్క్‌షాప్‌లు/హెచ్‌క్యూలకు పంపబడుతుంది.
సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) రిక్రూట్‌మెంట్ 2021 పరీక్ష కోసం ఎలాంటి ఫీజు లేదు.