ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి గూడ్ న్యూస్.. మొబైల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు..

First Published | Nov 25, 2021, 1:15 PM IST

ఎలక్ట్రానిక్స్ దిగ్గజం దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ (samsung)2022లో భారతదేశంలో శ్రామిక శక్తిని పెంచుకోవాలని యోచిస్తోంది. దీని కింద కంపెనీ భారతదేశంలోని టాప్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌(engineering institutes)ల నుండి దాదాపు 1000 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేయనుంది. ఈ విషయంపై కంపెనీ బుధవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

భారతదేశంలో శాంసంగ్ రిక్రూట్ చేసుకోబోయే ఇన్‌స్టిట్యూట్‌లలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), బిట్స్ పిలానీ(BITS),  ఎన్‌ఐ‌టి (NIT)తో సహా ఇతర టాప్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఉన్నాయి. కంపెనీ ప్రకటన ప్రకారం, 2022లో గ్రాడ్యుయేట్ అయిన యువ ఇంజనీర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ డేటా అనాలిసిస్ వంటి విభాగాల్లో నియమించుకొనుంది.

నివేదిక ప్రకారం, శాంసంగ్ ఢిల్లీ, కాన్పూర్, ముంబై, మద్రాస్, గౌహతి, ఖరగ్‌పూర్, బి‌హెచ్‌యూ, రూర్కీ, ఇతర కొత్త  ఐ‌ఐ‌టి (IIT) క్యాంపస్‌ల నుండి దాదాపు 260 మంది యువ ఇంజనీర్లను మూడు R&D కేంద్రాలకు (బెంగళూరు, నోయిడా, ఢిల్లీ) నియమించుకోనుంది. భారతదేశంలోని శాంసంగ్ R&D కేంద్రాలలో రిక్రూట్‌లలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ ప్రణాళిక రూపొందించబడింది.

Latest Videos


శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ (హెచ్‌ఆర్) సమీర్ వాధావన్ మాట్లాడుతూ, భారతదేశంలో పరిశోధన అండ్ అభివృద్ధి (ఆర్ అండ్ డి) విభాగం సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఏడాది 1000 మందికిపైగా ఇంజనీర్లను నియమించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.  

click me!