RRC CR recruitment 2022: సెంట్రల్ రైల్వేలో భారీగా అప్రెంటిస్ పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

First Published | Jan 17, 2022, 6:45 PM IST

 రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం  రైల్వేలోని వివిధ వర్క్‌షాప్‌లు/యూనిట్‌లలో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులపై నియామకం జరుగుతుంది. 

ఈ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 2,422లు ఉన్నాయి. దరఖాస్తు చేయాలనుకునే అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrccr.com/TradeApp/Loginని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహించబడుతుందని అభ్యర్థులు గమనించాలి. ఇతర మార్గాల ద్వారా దరఖాస్తులు ఆమోదించబడవు. 

  దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
సెంట్రల్ రైల్వేలో రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ జారీ చేసిన అప్రెంటీస్ పోస్టుల రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి 17 జనవరి 2022 నుండి ప్రారంభమై 16 ఫిబ్రవరి 2022 వరకు ఉంటుంది. 

RRC CR అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2022 వివరాలు

1. ముంబై క్లస్టర్‌లో పోస్టుల సంఖ్య - 1659

2. భుసావల్ క్లస్టర్‌లో పోస్టుల సంఖ్య - 418

3. పూణే క్లస్టర్‌లో పోస్టుల సంఖ్య - 152

4. నాగ్‌పూర్ క్లస్టర్‌లో పోస్టుల సంఖ్య - 114

5. షోలాపూర్ క్లస్టర్‌లో పోస్టుల సంఖ్య - 79

విద్యార్హత 
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి అర్హతను కలిగి ఉండాలి. అంతేకాకుండా కనీసం 50% మార్కులతో ట్రేడ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 15 ఏళ్లకు మించి  24 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ.100 కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ అండ్ కొత్త అప్‌డేట్‌లకు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా నోటిఫికేషన్‌ను చూడవచ్చు. 

Latest Videos


RRC CR అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2022: ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు క్రింద ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి దరఖాస్తు చేసుకోవచ్చు.

1. ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrccr.com/TradeApp/Loginని సందర్శించండి.

2. ఇప్పుడు మీ పూర్తి సమాచారాన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోండి.

3. ఇప్పుడు మీ  ఐ‌డి అండ్  పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి.

4. ఇప్పుడు అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.

5. తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

6. చివరగా తదుపరి అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోని ప్రింట్ అవుట్ తీసుకోండి.

click me!