ఈ పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లయ్ చేయాలనుకున్న అభ్యర్థులకు గరిష్ఠ వయసు 35 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 జీతం ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 31 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరితేది 31 జనవరి 2022. అప్లికేషన్ ప్రాసెస్, నోటిఫికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/recruitments ను చూడవచ్చు.