పరీక్ష లేకుండా ఎన్‌ఎం‌డి‌సిలో ఉద్యోగాలు.. బీటెక్‌, డిప్లొమా అర్హత ఉన్నవారు ఇలా అప్లయ్‌ చేసుకోండి..

Ashok Kumar   | Asianet News
Published : Jan 07, 2022, 05:09 PM ISTUpdated : Jan 07, 2022, 05:11 PM IST

నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్(NMDC)వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టు(apprentice posts)ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 59 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌/ఈ-మెయిల్‌ ద్వారా ధరఖాస్తు  చేసుకోవాలి. 

PREV
14
పరీక్ష లేకుండా ఎన్‌ఎం‌డి‌సిలో ఉద్యోగాలు.. బీటెక్‌, డిప్లొమా అర్హత ఉన్నవారు ఇలా అప్లయ్‌ చేసుకోండి..

దరఖాస్తుకు చేసుకోవడానికి జూన్‌ 15 చివరి తేది. ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమో, ఐటీఐలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.nmdc.co.in/ వెబ్‌సైట్‌ చూడవచ్చు.

24

మొత్తం ఖాళీలు: 59
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 16
టెక్నీషియన్ అప్రెంటిస్- 13
ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 30

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్:
mech.eng - 06 పోస్ట్‌లు
Elect. Eng. – 03 పోస్ట్‌లు
Elect & Electron Eng – 01 పోస్ట్‌లు
Mining Eng – 04 పోస్ట్‌లు
Civil Eng – 02 పోస్ట్‌లు
 

34

టెక్నీషియన్ అప్రెంటిస్:
Mech. Eng - 06 పోస్ట్‌లు
Elect. Eng – 03 పోస్ట్‌లు
Elect & Teleco Eng– 01 పోస్ట్‌లు
Mining Eng– 04 పోస్ట్‌లు
MOM - 03 పోస్ట్‌లు
Comp. Sci. & Appli – 01 పోస్ట్‌లు


విద్యార్హతలు- వేతనం:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మైనింగ్ ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో నాలుగేళ్ల డిగ్రీ (బీటెక్‌/బీఈ) చేసిన వారు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 20 వేల వేతనం చెల్లించనున్నారు.

టెక్నీషియన్ అప్రెంటిస్‌: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, మైనింగ్, మోడ్రన్ ఆఫీస్ ప్రాక్టీస్ మేనేజ్‌మెంట్‌ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ కోర్సుల్లో మూడేళ్ల డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.16 వేల వేతనం చెల్లించనున్నారు.

44

పి‌ఏ‌ఎస్‌ఏఏ(PASAA) పోస్టులకు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA) నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వరకు చెల్లించనున్నారు.

ఇతర సమాచారం:
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేది: 15 జూన్‌ 2021
ఈ- మెయిల్: bld5hrd@nmdc.co.in
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.nmdc.co.in/

click me!

Recommended Stories