ఎన్‌పి‌హెచ్‌సి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల.. వివిధ ఖాళీ పోస్టులకు ఇలా దరఖాస్తు చేసుకోండి

First Published | Dec 31, 2021, 11:54 AM IST

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(NHPC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్‌పి‌హెచ్‌సి-ఒక 'మినీ రత్న' కంపెనీ, 70.95% భారత ప్రభుత్వం యాజమాన్యంతో భారతదేశంలో అతిపెద్ద జలవిద్యుత్ కంపెనీ. ఇంకా జలవిద్యుత్ ప్లాంట్ల డిజైన్, నిర్మాణం ఇంకా ఆపరేషన్ లో అగ్రగామిగా ఉంది. 

తాజాగా ఎన్‌పి‌హెచ్‌సి పలు ఖాళీ ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి సంస్థ ఒక నోటిఫికేషన్ (Job Notification) కూడా విడుదల చేసింది. అయితే ఈ ఖాళీలను  ట్రైనీ ఇంజనీర్ విభాగంలో  భర్తీ చేయనున్నారు. మొత్తం 53 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. గేట్ 2021(GATE-2021) లో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుది. ఈ నేపథ్యంలో GATE-2021 ఎగ్జామ్ రాసిన వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50 వేల నుంచి రూ.1.60 లక్షలు చెల్లించనున్నారు.
 

ట్రైనీ ఇంజనీర్(సివిల్)    B.Sc,B.Tech/BE
 మొత్తం ఖాళీలు         29
అర్హత వయస్సు                                      30

ట్రైనీ ఇంజనీర్(మెకానికల్)    B.Sc,B.Tech/BE
 మొత్తం ఖాళీలు         20
అర్హత వయస్సు                                      30

ట్రైనీ ఇంజనీర్(ఎలెక్ట్రికల్)    B.Sc,B.Tech/BE
 మొత్తం ఖాళీలు         4
అర్హత వయస్సు                                      30

ట్రైనీ ఆఫీసర్(ఫైనాన్స్)    C.A/ICWAలేదాCMA
 మొత్తం ఖాళీలు         02
అర్హత వయస్సు                                      30

ట్రైనీ ఆఫీసర్(సెక్రెటరీ)    సెక్రెటరీ క్వాలిఫికేషన్ లో అర్హత
 మొత్తం ఖాళీలు         02
అర్హత వయస్సు                                      30

Latest Videos


వేతనం: బేసిక్ పేతో  డి‌ఏ, హెచ్‌ఆర్‌ఏ, మెడికల్ ఫెసిలిటీ, పెన్షన్ ఇతర అందిస్తారు.

ప్లేస్మెంట్:  ప్రొజెక్ట్స్, పవర్ స్టేషన్స్, ఎన్‌హెచ్‌పి‌సి ప్రదేశాలలో

ఎంపిక: గేట్ 2021 స్కోర్

ధరఖాస్తు ప్రారంభ తేదీ: 22-12-2021
ధరఖాస్తు చివరి తేదీ:  17/01/2022 

ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: తరువాత హోం పేజీలో Careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: తరువాత నోటిఫికేషన్ కింద Click here for online application అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: తరువాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మొదటగా మీరు అప్లై చేయాలనుకుంటున్న పోస్టును సెలక్ట్ చేసుకోవాలి.
Step 5: తర్వాత మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలను ఎంటర్  చేసి అప్లై చేసుకోవాలి.
Step 6: అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపిన తర్వాత ఫామ్ ను ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

click me!