ఇస్రో జేటిఓ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ప్రక్రియ
ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ isro.gov.inలో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ప్రకటన విడుదలతో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తును 20 నవంబర్ 2021లోగా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు రూ. 250 రుసుమును చెల్లించాలి, దీనిని ఆన్‌లైన్ మార్గాల్లో (డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్) చెల్లించవచ్చు. అయితే, ఇస్రో అభ్యర్థులకు ఆఫ్‌లైన్ ఫీజు చెల్లింపు ఆప్షన్ కూడా ఇచ్చింది అభ్యర్థులు ఎస్‌బిఐ చలాన్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు.