Railway Jobs: యువతకు జాక్‌పాట్.. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

First Published | Jul 24, 2024, 1:21 PM IST

నిరుద్యోగ యువతకు ఇండియన్ రైల్వే సూపర్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి నెలకు జీతం ఎంత? దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Railway Jobs

దేశంలోని నిరుద్యోగ యువతకు ఇండియన్ రైల్వేస్ తీపికబురు చెప్పింది. దేశ వ్యాప్తంగా 7వేల 951 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తిచేసిన యువతకు ఇది మంచి అవకాశం.

Indian Railway Jobs

భారతీయ రైల్వే యువతకు జాక్ పాట్ ప్రకటించింది. ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

ఉద్యోగానికి విద్యార్హతలు:

కెమికల్ అండ్ మెటలర్జికల్ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ 45 మార్కులకు తగ్గకుండా ఉత్తీర్ణులై ఉండాలి. జూనియర్ ఇంజినీర్ పోస్టుకు డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ ఇంజినీర్ (ఐడీ): పీజీడీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్), బీసీఏ/బీటెక్ డిప్లొమా/ఇంజినీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు డెపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 


Railway Jobs

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 10 ఏళ్లు గరిష్ట వయో పరిమితిని సడలించారు.

Railway Job Vacancies

ఖాళీలు: జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ లేదా మెటలర్జికల్ అసిస్టెంట్ - 7,934 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

కెమికల్ సూపర్ వైజర్/ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్ వైజర్/ రీసెర్చ్ - 17 పోస్టులు కలిపి మొత్తం 7,951 పోస్టులను భర్తీ చేయనున్నారు.
 

RRB Jobs

నెలవారీ జీతం: తొలుత వేతనం రూ.35,400గా నిర్ణయించారు.

దరఖాస్తుకు చివరి తేదీ:

రైల్వే ఉద్యోగాల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 30, 2024న ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.  ఆగస్టు 29 2024న ముగుస్తుంది. దరఖాస్తు చేయడానికి, మరింత సమాచారం కోసం  https://www.rrbchennai.gov.in/ వెబ్‌సైట్‌ని సందర్శించండి.

Latest Videos

click me!