రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్.. ఈ అర్హత ఉంటే చాలు!

Ashok Kumar   | Asianet News
Published : Sep 25, 2021, 04:42 PM IST

పదో తరగతి తరువాత ఐ‌టి‌ఐ చేసి ఉద్యోగం కోసం ఎదురుచూతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. న్యూఢిల్లీలోని నార్తర్న్‌ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) వివిధ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. 

PREV
14
రైల్వేలో  భారీగా ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్.. ఈ అర్హత ఉంటే చాలు!

ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 3093 పోస్టులను భ‌ర్తీ చేయ‌నుంది. ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబ‌ర్ 20 నుంచి ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఈ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ అక్టోబ‌ర్ 20 వ‌ర‌కు కొన‌సాగుతుంది.

24
इंडियन रेलवे

అప్రెంటీస్ కాలపరిమితి, జీత భత్యాలు, ఎంపిక విధానం తదితర వివరాలను సెప్టెంబర్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ సమయంలో వెల్లడిస్తారు. అభ్యర్థులు పూర్తి వివ‌రాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్‌ http://rrcnr.org/ను చూడవచ్చు.

34

అర్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా  పదో తరగతితో ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు 15 ఏళ్లు నుంచి 24 ఏళ్లు మ‌ధ్య ఉండాలి.
ట్రేడులు: మెకానిక్‌(డీజిల్‌), ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, కార్పెంటర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌ తదితరాలు.
నోటిఫికేషన్ విడుదల తేదీ: 14 సెప్టెంబర్ 2021

44

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 20 సెప్టెంబర్ 2021
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముగింపు తేది: 20 అక్టోబర్ 2021
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
పూర్తి వివరాల కోసం అధికారిక  వెబ్‌సైట్‌: http://rrcnr.org/ చూడవచ్చు.

click me!

Recommended Stories