నీట్ ఎస్ఎస్ 2021 ఎగ్జామ్ ప్యాటర్న్ లో మార్పు.. కేంద్రం, ఎంసిఐ నుంచి స్పందన కోరిన సుప్రీం కోర్టు..

First Published | Sep 20, 2021, 1:58 PM IST

నీట్ ఎస్ఎస్ 2021 కోసం ఎగ్జామ్ ప్యాటర్న్ లో చివరి నిమిషంలో మార్పులు చేశారని ఆరోపిస్తూ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు చేసిన విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ వైద్య మండలికి (MCI) నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం దీనిపై విచారణ జరగనుంది.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-సూపర్ స్పెషాలిటీ (NEET-SS) 2021 పరీక్షా నమూనాలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చేసిన "సడెన్" అండ్ "లాస్ట్-మినిట్" మార్పులను సవాలు చేస్తూ సుప్రీం కోర్టు సోమవారం ఒక రిట్ పిటిషన్‌ను విచారించింది. ఎగ్జామ్ ప్యాటర్న్ ను క్రాక్ చేయడం ద్వారా సూపర్-స్పెషలిస్టులు కావాలని దేశవ్యాప్తంగా 41 మంది అర్హత కలిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

మార్పులు చేయడానికి అధికారం లేనప్పటికీ, స్పష్టంగా ఏకపక్ష కారణాలతో నీట్ ఎస్ఎస్ 2021 పరీక్షకు ముందు పేపర్ నమూనాలో చేసిన మార్పులను రద్దు చేయాలని పిటిషన్ కోరింది. దీనిని జస్టిస్ డివై చంద్రచూడ్, బివి నాగరత్నలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.


పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, ఈ సంవత్సరం నవంబర్ 13/1న జరిగే పరీక్షకు నోటిఫికేషన్ 23  జూలై 2021న జారీ చేసినట్లు సమర్పించారు. అయితే కొత్త పరీక్ష సరళికి సంబంధించి 2021 ఆగస్టు 31న మరో నోటిఫికేషన్ జారీ చేసింది. 2018 నుండి 2020 వరకు ఉనికిలో ఉన్న నమూనా ప్రకారం సూపర్ స్పెషాలిటీలో ప్రశ్నలకు 60% మార్కులు, ఫీడర్ కోర్సుల ప్రశ్నలకు 40% మార్కులు కేటాయించారు. అయితే ప్రతిపాదిత నమూనా ప్రకారం, క్రిటికల్ కేర్ సూపర్ స్పెషాలిటీ కోసం మొత్తం ప్రశ్నలు జనరల్ మెడిసిన్ నుండి ఉంటుంది.
 

ఇతర సబ్జెక్టుల విద్యార్థులకు ఇది చాలా అన్యాయం కలిగిస్తుందని న్యాయవాది దివాన్ వాదించారు. పరీక్ష నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అధికార యంత్రాంగం ఈ మార్పులు చేయరాదని, విద్యార్థులు వారి ప్రేపరేషన్ కూడా ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ప్రేపరేషన్ ప్రారంభమైన తర్వాత నియమాలను మార్చలేమని ఇది బాగా స్థిరపడిన సూత్రం అని సీనియర్ న్యాయవాది వాదించారు. దీనిపై కోర్టు తదుపరి విచరణ సోమవారం సెప్టెంబర్ 27న వాయిదా వేసింది.
 

Latest Videos

click me!