Jobs: పరీక్ష లేదు. ఇంటర్వ్యూ లేదు. టెన్త్‌ పాసైతే చాలు.. 44,228 ఉద్యోగాలు మీకోసమే

First Published | Jul 24, 2024, 4:46 PM IST

మీరు పదో తరగతి పూర్తి చేశారా..? మంచి మెరిట్ మార్కులతో టెన్త్ పాసై.. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, ఎలాంటి రాత పరీక్ష గానీ, ఇంటర్వూ గానీ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామంటోంది మీకోసమే... 

ఇండియా పోస్ట్ (భారతీయ డాక్) శాఖ గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 15 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించింది.

ఖాళీల వివరాలు

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 23 సర్కిల్ లలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 44,228 ఖాళీలను ఫిల్ చేయడమే లక్ష్యంగా ఈ రిక్రూట్మెంట్ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సర్కిల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Latest Videos


Postal Jobs

అర్హతలు ఇవే...

GDS పోస్టులకు అర్హత సాధించడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి (మెట్రిక్యులేషన్) పాస్ అయినట్లు ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి.

ఆగస్టు 5 వరకే గడువు...

జులై 15 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఆగస్టు 5 వరకు గడువు ఉంది.

ఆన్ లైన్ లోనే దరఖాస్తులు... 

https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 100 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. 

గరిష్టంగా రూ.29,380 జీతం..

GDS పోస్టులకు దేశవ్యాప్తంగా ఆయా స్థానాలను బట్టి జీతం రూ.10,000 నుంచి రూ. 29,380 చెల్లిస్తారు. 

click me!