IAF Recruitment 2026 : యువతకు బంపరాఫర్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం పొందే లక్కీ ఛాన్స్

Published : Nov 29, 2026, 01:14 PM IST

IAF Recruitment 2026 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 284 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల పురుష, మహిళా అభ్యర్థులు నవంబర్ 12 నుంచి డిసెంబర్ 11, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

PREV
15
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు

IAF Recruitment 2026 : దేశ రక్షణలో పాలుపంచుకోవాలని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్ కావాలని కలలు కనే యువతకు ఇదొక సువర్ణావకాశం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్) విభాగాల్లో మొత్తం 284 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ 2028 జనవరిలో ప్రారంభమయ్యే కోర్సుల కోసం జరుగుతోంది. పురుష, మహిళా అభ్యర్థులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 12, 2026 నుంచి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి డిసెంబర్ 11, 2026లోపు ఫారమ్‌లను సమర్పించవచ్చు.

25
విద్యార్హతలు

ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులు 12వ తరగతి (ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్స్ తో ఇంటర్మీడియట్) పాసై ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 3 ఏళ్ల డిగ్రీ లేదా 4 ఏళ్ల బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) పోస్టుల కోసం.. సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ/బీటెక్ (ఫిజిక్స్, మ్యాథ్స్ తో పాటు) ఉత్తీర్ణులై ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్) పోస్టులకు అర్హతలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ప్రాథమిక అర్హత ఒకటే ఉంటుంది. వెపన్ సిస్టమ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్‌కు గ్రాడ్యుయేషన్, అకౌంట్స్‌కు కామర్స్/ఫైనాన్స్ డిగ్రీ, ఎడ్యుకేషన్ పోస్టులకు పీజీ డిగ్రీ అవసరం.

35
ఖాళీల వివరాలు

పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ కింద పోస్టులను భర్తీ చేస్తారు.

ఫ్లయింగ్ బ్రాంచ్‌లో - 36

గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ ఏఈ(ఎల్), ఏఈ(ఎం)లో - 124 పోస్టులు

గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, వాతావరణ శాస్త్ర విభాగంలో - 108 పోస్టులు ఉన్నాయి.

గేట్ (GATE) స్కోర్ ఆధారంగా గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)కు - 16 పోస్టులు

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ఫ్లైట్ బ్రాంచ్‌కు - 16 పోస్టులు రిజర్వ్ చేశారు.

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ విడుదల - నవంబర్ 11, 2026

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం - నవంబర్ 12, 2026 (ఉదయం 11:00 గంటలకు)

దరఖాస్తుకు చివరి తేదీ - డిసెంబర్ 11, 2026 (రాత్రి 11:30 గంటల వరకు)

ఆన్‌లైన్ పరీక్ష తేదీ - జనవరి 31, 2027

కోర్సు ప్రారంభం - జనవరి 2028

45
వయోపరిమితి, వైవాహిక స్థితి

వయస్సును 2028 జనవరి 1 నాటికి పరిగణలోకి తీసుకుంటారు. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ట వయోపరిమితి 26 ఏళ్లు.

గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) అభ్యర్థుల వయస్సు 20 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే దరఖాస్తుదారులు కోర్సు ప్రారంభమయ్యే సమయానికి అవివాహితులై ఉండాలి. శిక్షణ సమయంలో వివాహం చేసుకోవడానికి అనుమతి లేదు.

55
ఎలా దరఖాస్తు చేయాలి?

ముందుగా అభ్యర్థులు ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ afcat.edcil.co.in కు వెళ్లాలి.

తర్వాత AFCAT 1/2027 అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి.

యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

వ్యక్తిగత, విద్యార్హత, ప్రిఫరెన్స్ వివరాలను నమోదు చేయాలి.

అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

ఫారమ్‌ను ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.

చివరగా, ఫీజు చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి.

Read more Photos on
click me!

Recommended Stories