Published : Nov 07, 2026, 10:01 AM ISTUpdated : Nov 07, 2026, 10:15 AM IST
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులకు గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వే లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వివరాలు ఇక్కడ చూడండి.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దం అవుతున్న యువత తమ కలను నెరవేర్చుకునేందుకు మంచి అవకాశం వచ్చింది. ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది… రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 09/2026 కింద మొత్తం 191 ఖాళీలను భర్తీ చేయనుంది.
లీగల్ అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్, హిందీ జూనియర్ ట్రాన్స్లేటర్ సహా ఏడు రకాల పోస్టుల భర్తీకి రైల్వే శాఖ సిద్దమయ్యింది…. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.19,900 నుంచి రూ.44,900 వరకు జీతం ఉంటుంది… ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
25
ఏయే పోస్టులకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
పోస్టుల వారిగా ఖాళీలు..
చీఫ్ లా అసిస్టెంట్ - 17 పోస్టులు
పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 21 పోస్టులు
సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ - 8 పోస్టులు
హిందీ జూనియర్ ట్రాన్స్లేటర్ - 79 పోస్టులు
స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ - 27 పోస్టులు
సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనీ - 3 పోస్టులు
గ్రేడ్ III ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు - 36 పోస్టులు
ఇలా ఇండియన్ రైల్వేలో మొత్తం 191 ఖాళీలను భర్లీ చేయనున్నట్ు ప్రకటించారు. ఒక్కో పోస్టుకు వేర్వేరు విద్యార్హతలు, వయోపరిమితి ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు తమ అర్హతకు తగిన పోస్టును ఎంచుకోవాలి.
35
విద్యార్హతలు, వయోపరిమితి వివరాలు
రైల్వేలో భర్తీ చేయనున్న పోస్టులకు 12వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హతలతో పాటు డిగ్రీ, డిప్లొమా, లా డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన విద్యాసంస్థ లేదా యూనివర్సిటీ నుంచి ఈ అర్హతలు పొంది ఉండాలి. అయితే ఒక్కో పోస్టుకి ఒక్కో విద్యార్హత అవసరం… కాబట్టి దరఖాస్తు చేసుకునేముందు మీరు ఏ పోస్టుకు అర్హులో నోటిఫికేషన్ పరిశీలించండి. ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న వారు అప్లై చేయడానికి అనర్హులు.
వయోపరిమితి
ఇక పోస్టును బట్టి వయోపరిమితి 22 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది… ఈ వివరాల కోసం నోటిఫికేషన్ పరిశీలించండి.
రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, మైనారిటీలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.250 ఉంటుంది. మిగతా కేటగిరీల అభ్యర్థులకు రూ.500 ఫీజు నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హిందీ జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టుకు అదనంగా ట్రాన్స్లేషన్ టెస్ట్ ఉంటుంది. సీబీటీలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50, జీకే 15, రీజనింగ్ 15, మ్యాథ్స్ 10, జనరల్ సైన్స్ 10 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
55
దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడు?
రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 6, 2026 చివరి తేదీ. అలాగే డిసెంబర్ 7 నుంచి 16 వరకు అప్లికేషన్ కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ తేదీలను అధికారిక నోటిఫికేషన్లో ఒకసారి సరిచూసుకోవాలి.
అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి నోటిఫికేషన్ చదివి, పోస్టుల వారీగా అర్హతలు, అవసరమైన సర్టిఫికెట్లను చెక్ చేసుకున్న తర్వాతే అప్లై చేయాలి. ఎలాంటి తప్పులు లేకుండా అప్లికేషన్ సబ్మిట్ చేయడం ముఖ్యం. చివరి నిమిషంలో కాకుండా ముందుగానే దరఖాస్తు చేసుకుని టెన్షన్ లేకుండా ప్రిపేర్ కావడం ఉత్తమం.