మీ పిల్ల‌ల పై చదువులకు ఎడ్యుకేషన్ ఫండ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి.. ? ఈ 3 స్కీలుల లాభాలు తెలుసుకోండి..

First Published | Nov 11, 2021, 5:10 PM IST

పిల్లల భవిష్యత్తుకు కోసం తల్లిదండ్రులు ఎంతో ఖర్చుచేస్తుంటారు. వారి వృతి, వ్యాపారం లేదా ఉద్యోగం ఏదైనాసరే ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఉన్న పిల్లల చదువు(education)కి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో కొందరు తల్లిదండ్రులు వారి పిల్ల‌ల చదువుపై ఎక్కువ దృష్టి పెడుతుంటారు. 

ఆర్ధికంగా వారి పై చదువుల కోసం డబ్బును ముందే సమకూరుస్తుంటారు. ముఖ్యంగా ఎలాంటి సమయంలోనైనా చదువుకు స‌రిప‌డినంత మొత్తం సరైన సమయంలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.  ఇందుకు ముందుగానే సరైన పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌లను ఎంచుకొని అమ‌లు చేయాలి.  

మరో వైపు పెరుగుతున్న వ్యయాలు, పిల్లల ఫీజులు, ఉన్నత చదువుకు కావల్సిన ఖర్చులు సామాన్యులకి మరింత భారంగా ఉంటుంది. భ‌విష్య‌త్‌లో పిల్లల ఉన్న‌త చదువు కోసం ఖ‌ర్చు పెట్ట‌డానికి  ఎందులో పెట్టుబడి పెట్టాలో కొన్ని పొదుపు ప‌థ‌కాలు ఇక్క‌డ ఉన్నాయి. ఇవి మీకు చాలా ఉపయోగకరంగా ఇంకా లాభదాయకంగా ఉంటాయి. ఇంకా ఎక్కువ మొత్తాన్ని మీ చేతికి వచ్చేలా చేస్తుంది.


ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: 
పి‌పి‌ఎఫ్ లో పెట్టుబ‌డి  మంచి వ‌డ్డీ రేటు, రాబ‌డిని అందించే దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి ఎంపిక‌ల‌లో ఒక‌టి. పీపీఎఫ్‌లో ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు వార్షికంగా 7.1% ఉంది. దీంట్లో ఏడాదికి రూ. 1.50 ల‌క్షలు పెట్టుబ‌డి పెడితే 15 సంవ‌త్స‌రాల తరువాత ఇదే వ‌డ్డీరేటు కొన‌సాగితే దాదాపు రూ. 46.50 ల‌క్ష‌ల మొత్తాన్ని పొందుతారు. చాలా సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డుల‌లో పి‌పి‌ఎఫ్ ఒక‌టి. దీనిని ప్ర‌భుత్వంచే నిర్వ‌హించ‌బ‌డుతుంది. మొత్తం కాలం  వ్య‌వ్య‌ధి 15 సంవ‌త్స‌రాలు, మధ్యలో అవసరం పడితే కొంత మొత్తాన్ని తీసుకోవచ్చు. 15 ఏళ్ళ తరవాత కూడా 5 ఏళ్ళ చొప్పున పెట్టుబడి కొనసాగించవచ్చు. ఈ ఖాతాలో క‌నీసం రూ. 500 నుండి గ‌రిష్టంగా రూ. 1.5 ల‌క్ష‌ల పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న:
10 ఏళ్ల‌లోపు బాలిక‌ల కోసం ప్ర‌భుత్వం 2014లో సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఒక సంవ‌త్స‌రంలో క‌నీస మొత్తం రూ. 500, గ‌రిష్టంగా రూ. 1.5 ల‌క్ష‌లు వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ప్ర‌స్తుత వ‌డ్డీరేటు వార్షికంగా 7.6%. అయితే మొత్తంగా 15 సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డి పెట్టాలి. ఖాతా మెచ్యూరిటీ బాలిక‌ల వ‌య‌స్సు 21 సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కు ఉంటుంది. మెచ్యూరిటీ తరువాత వ‌చ్చే అధిక మొత్తం న‌గ‌దును బాలిక‌ల ఉన్న‌త విద్య‌కు, వివాహానికి ఉప‌యోగించ‌వ‌చ్చు.

మ్యూచువ‌ల్ ఫండ్స్:
మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో మ‌నం పెట్టిన పెట్టుబ‌డుల‌ను నిపుణులైన ఫండ్ మేనేజ‌ర్లు నిర్వ‌హిస్తారు. అధిక కాలానికి రిస్క్ వైఖ‌రిని ఫండ్ ఎంచుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్ లో  కాస్త రిస్క్ తక్కువగా ఉంటాయి. ఒక ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. అయితే, మ్యూచువల్ ఫండ్స్ లో కచ్చితమైన రాబడి వస్తుందని చెప్పలేము. సిప్ ద్వారా నెల నెలా పెట్టుబడి పెడితే కొంత వరకు రిస్క్ తగ్గవచ్చు. దీర్ఘకాలంలో సగటున 10 నుంచి 12 శాతం వరకు రాబడి ఆశించవచ్చు. 

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో కూడా పిల్ల‌ల విద్యా నిధి ప్ర‌భావితం కాకూడ‌దు. కాబ‌ట్టి, అన్ని ర‌కాల అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల కోసం ఆరోగ్య బీమా, జీవిత బీమా (ట‌ర్మ్ ఇన్సూరెన్స్‌)ల కోసం ప్ర‌ణాళిక‌లు వేసుకోండి. మీ పిల్ల‌ల విద్య కోసం పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌ల‌ను తాక‌కుండా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించండి. ముఖ్యంగా బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల నుంచి, అలాగే పిల్లల కోసం అందించే ప్రత్యేక పధకాల నుంచి దూరంగా ఉండండి. 

Latest Videos

click me!