నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలో భారీగా ఉద్యోగావకాశాలు.. ఇలా అప్లయ్ చేసుకోండీ..

First Published | Nov 5, 2021, 5:34 PM IST

 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సువర్ణావకాశం కల్పించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ‌ఐ (FSSAI) ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ మేనేజర్, ఫుడ్ అనలిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ తో పాటు ఇతర ఖాళీ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్   నోటిఫికేషన్ విడుదల చేసింది. 

అయితే ఆన్ లైన్ ధరఖాస్తు  ప్రక్రియ 8 అక్టోబర్ 2021 నుండి ప్రారంభమైంది. ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://fssai.gov.inలో చూడవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ సందర్శించడం ద్వారా నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.
 

ఈ రిక్రూట్‌మెంట్‌ ద్వారా మొత్తం 255 పోస్టులను నియమించనుంది. ఇందుకు దరఖాస్తు చివరి తేదీ 7 నవంబర్ 2021గా నిర్ణయించారు. తుది గడువు తర్వాత అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయలేరు. కాబట్టి అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా వీలైనంత త్వరగా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థుల ఎంపిక కోసం రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ, ఓ‌బి‌సి, ఈ‌డబల్యూ‌ఎస్ అభ్యర్థులకు రూ. 1500 కాగా, ఎస్‌సి కేటగిరీ, ఎస్‌టి కేటగిరీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500. అభ్యర్థులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు రుసుమును సమర్పించవచ్చు.

Latest Videos


ముఖ్యమైన తేదీలు  
1. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం - 8 అక్టోబర్ 2021
2.  దరఖాస్తు చివరి తేదీ - 7 నవంబర్ 2021
3. దరఖాస్తు రుసుము సమర్పించడానికి చివరి తేదీ - 7 నవంబర్ 2021
4. రిక్రూట్‌మెంట్ తేదీ - పరీక్ష తేదీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐలో కొనసాగుతున్న రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత రంగంలో డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగి ఉండాలీ. విద్యార్హత, వయోపరిమితికి సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్   https://fssai.gov.in ని సందర్శించడం ద్వారా నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  

click me!