భారతదేశంలో అత్యధిక జీతాలున్న టాప్ 5 జాబ్స్

First Published | Jan 3, 2025, 7:48 PM IST

ప్రస్తుతం మనిషి జీవితం చాలా కాస్ట్లీ అయిపోయింది. తినే తిండి నుండి కట్టుకునే బట్ట, పిల్లల చదువు... ఇలా ప్రతీది ఖరీదయిపోయింది. దీంతో మంచి జీవితం కావాలంటే ఐదంకెల జీతం తప్పనిసరి. ఇలా దేశంలో అత్యధిక సాలరీలు వుండే ఉద్యోగాలేంటో చూద్దాం.. 

భారతదేశంలో అత్యధిక జీతాలుండే ఉద్యోగాలు

భారతీయులు వ్యాపారాల కంటే ఉద్యోగాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగాల్లోనూ ఉద్యోగాలకు మామూలు పోటీ వుండదు. చిన్న గుమాస్తా ఉద్యోగాలకు కూడా డిగ్రీలు, పీజీలు చేసినవారు పోటీ పడుతుంటారు. మనోళ్లు రిస్క్, ఒత్తిడి వుండే వ్యాపారాల కంటే హాయిగా నెలనెలా అకౌంట్లో జీతం పడే ఉద్యోగాలనే కోరుకుంటారు. 

ప్రస్తుతందేశం ఆర్థికంగానే కాదు సామాజికంగాను చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో యువతకు ఉద్యోగ,  ఉపాది అవకాశాలు కూడా బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు వేలల్లో కాదు లక్షల్లో కూడా జీతాలు వచ్చే ఉద్యోగాలు కూడా చాలా వచ్చాయి. ఇలా అత్యధిక సాలరీ వుండే టాప్ 5 ఉద్యోగాల గురించి తెలుసుకుందాం.

ఐఎఎస్, ఐపిఎస్ అంటే అదో క్రేజ్...

1. సివిల్ సర్విసెస్:

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)... ఈ పేరు వింటేనే ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. దేశంలో అత్యున్నతమైన ఉద్యోగాలివి... వీటిని పొందేందుకు ఏటా లక్షలాదిమంది యువత పోటీ పడుతుంటారు. కానీ కొన్ని వందలమంది మాత్రమే పేరుచివర ఐఎఎస్, ఐపిఎస్ చేర్చుకునే అవకాశాన్ని పొందుతారు. 

సమాజంలో మంచి గౌరవం, ప్రభుత్వంలో మంచి హోదాతో పాటు సంపాదన కూడా బాగుండే జాబ్స్ ఈ ఐఎఎస్, ఐపిఎస్ ఉద్యోగాలు. పాలనాపరమైన కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం వీరికి వుంటుంది. ఇలా వీరిపై పెద్ద బాధ్యతలే కాదు మంచి జీతం, అలవెన్సులు, ఇతర సౌకర్యాలు వుంటాయి. 


డాక్టర్లకు డబ్బులే డబ్బులు...

2. వైద్య వృత్తి:

వైద్యుడు లేదా వైద్యారోగ్య రంగాలకు చెందిన నిపుణులకు మంచి ఆదాయం వుంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతయినా ఖర్చు చేయడానికి వెనకాడటంలేదు...కాబట్టి వైద్యులు రెండుచేతులా సంపాదిస్తున్నారు. వైద్యులతో పాటు వైద్యరంగంలో ఇతర నిపుణులు కూడా మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు. 

ప్రజారోగ్యంపై వైద్యులు గణనీయమైన ప్రభావాన్ని చూపడానికి వీలుంటుంది. భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోంది... కాబట్టి నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులకు మంచి డిమాండ్ వుంది. ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా వైద్యులకు మంచి వేతనాలు లభిస్తున్నాయి.  

ఇంజనీరింగ్ కెరీర్

3. ఇంజనీరింగ్:

ఇంజనీర్లకు మరీముఖ్యంగా ఏరోస్పేస్, పునరుత్పాదక ఇంధనం, సమాచార సాంకేతికత (ఐటీ) వంటి రంగాల్లో పనిచేసేవారికి ఆకట్టుకునే ఆర్థిక అవకాశాలను అందుకుంటున్నారు. అత్యాధునిక సాంకేతికతలను రూపొందించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లేదా దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడం ద్వారా ఇంజనీర్లు భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు.

గంటకు లక్షల్లో సంపాదించే లాయర్లున్నారు...

4. లా:

న్యాయ కెరీర్ ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే కాకుండా సామాజిక న్యాయం, చట్ట పాలనను నిలబెట్టే అవకాశాన్ని కూడా అందిస్తుంది. న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు సమసమాజాన్ని నిర్వహించడానికి దోహదపడతారు. న్యాయ వ్యవస్థలోని వారు మంచి గౌరవాన్ని కూడా పొందుతారు... అదే సమయంలో మంచి సంపాదనను కూడా కలిగివుంటారు. మనదేశంలో గంటకు లక్షలు చార్జ్ చేసే లాయర్లు కూడా వున్నారు...దీన్నిబట్టి న్యాయవ్యవస్థలో ఆదాయం ఏ స్థాయిలో వుంటుందో అర్థం చేసుకోవచ్చు. 

Entrepreneur

5.  Entrepreneur (వ్యవస్థాపకత):

పెట్టుబడులు పెట్టడం, స్టార్టప్‌లను ప్రారంభించడం వలన ఆర్థిక విజయానికి మార్గం లభిస్తుంది. భారతదేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నందున ఈ రంగంలో కూడా యువత భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. చిన్నచిన్న స్టార్టప్స్ ద్వారా వందలు వేల కోట్లు సంపాదించిన ఎంటర్ ప్రెన్యూర్స్ కూడా వున్నారు. 

Latest Videos

click me!