నెలకు రూ.35,000 జీతం ... ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు

First Published | Dec 19, 2024, 2:15 PM IST

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలను పొందే అద్భుత అవకాశం. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు చెందిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి. 

Prasar Bharathi Jobs

Prasar Bharathi Jobs : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రసార భారతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. టెలికాస్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి  రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో మంచి సాలరీతో కూడిన ఉద్యోగం... అదికూడా ఎలాంటి రాతపరీక్ష లేకుండానే కాబట్టి పోటీ ఎక్కువగా వుండే అవకాశాలున్నాయి. 
 

Prasar Bharathi Jobs

విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థల నుండి ఎలాక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫోటోగ్రఫి, సినిమాటోగ్రఫీలో డిగ్రీ లేదా డిప్లోమా చేసివుండాలి. 

అనుభవం : కనీసం ఒక సంవత్సరం కెమెరా ఆపరేషన్స్ ఆండ్ మెయింటెనెన్స్ అనుభవం వుండాలి. 

వయో పరిమితి :  నోటిఫికేషన్ వెలువడే నాటికి 35 ఏళ్లలోపు వయసు వున్నవారే అర్హులు. 

పోస్టులు : ప్రసార భారతిలో టెలికాస్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 3 పోస్టులను భర్తీ చేస్తారు. 

సాలరీ : ఎంపికయిన అభ్యర్థికి ప్రతి నెలా రూ.35,000 సాలరీ వస్తుంది. 
 


Prasar Bharathi Jobs

ఎంపిక విధానం : 

అన్ని అర్హతలు కలిగి ప్రసార భారతిలో ఉద్యోగానికి ఆసక్తి చూపించేవారు http://applications.prasarbharati.org/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ( 11.12.2024) వెలువడిన నాటినుండి 15 రోజుల లోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు... ఇతర ఏ మార్గాల్లో స్వీకరించబడవని ప్రసార భారతి అధికారులు తెలిపారు. 

ప్రసార భారతి అధికారిక వెబ్ సైట్ లో ఈ టెలికాస్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ సమయంలో  ఏదయినా సమస్య తలెత్తినా, ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇతర ఏ అనుమానాలున్నా  cmsection205@gmail.com కు ఈమెయిల్ చేయవచ్చు. 

గమనిక : ఈ టెలికాస్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారు ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో పనిచేయాల్సి వుంటుంది. రెండేళ్ల కాంట్రాక్ట్ మాత్రమే వుంటుంది. ఆ తర్వాత సంస్థ అవసరాలు, పనితీరు ఆధారంగా పొడిగించాలా? వద్దా? అన్నది ఆధారపడి వుంటుంది. ఇంటర్వ్యూలో ఎంపికయి షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు మాత్రమే ఈమెయిల్ ద్వారా సమాచారం అందించబడుతుంది.  

Latest Videos

click me!